రాజేంద్రనగర్: ఆసుపత్రిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
విధాత: ఆసుపత్రిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్‌లో జరిగింది. రాజేంద్ర నగర్ సిఐ కనకయ్య కథనం మేరకు… నెల్లూరుకు చెందిన సుదీప్తి (27) అవివాహిత. బండ్లగూడ జాగీర్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఉంటూ ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఈ నెల 6 న అనారోగ్యంతో ఆమె స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో మూడు రోజులు చికిత్స పొంది పూర్తి గా కోలుకుంది. మంగళవారం మధ్యాహ్నం ఆమె ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి కావాల్సి ఉంది. కాగా ఆ […]

విధాత: ఆసుపత్రిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్‌లో జరిగింది. రాజేంద్ర నగర్ సిఐ కనకయ్య కథనం మేరకు… నెల్లూరుకు చెందిన సుదీప్తి (27) అవివాహిత. బండ్లగూడ జాగీర్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఉంటూ ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది.
ఈ నెల 6 న అనారోగ్యంతో ఆమె స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో మూడు రోజులు చికిత్స పొంది పూర్తి గా కోలుకుంది. మంగళవారం మధ్యాహ్నం ఆమె ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి కావాల్సి ఉంది. కాగా ఆ రోజు ఉదయం 9 గంటల సమయంలో సుదీప్తి గదిలోకి నర్సు వెళ్లేందుకు ప్రయత్నించగా లోపలి నుంచి తలుపు గడియపెట్టి ఉంది.
సిబ్బంది తలుపు బద్దలు కొట్టి లోపలికెళ్లి చూసేటప్పటికే సుదీప్తి ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి తల్లి బెంగళూరులో ఆమె సోదరుడి దగ్గర ఉంటోంది. వెంటనే ఆసుపత్రి నిర్వాహకులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.