Wife Suicide | ఉడకబెట్టిన కోడి గుడ్ల కోసం కొట్లాట.. మూడో అంతస్తు నుంచి దూకి భార్య ఆత్మహత్య
Wife Suicide | దంపతుల మధ్య గొడవలు సహజమే. కానీ ఆ గొడవలు కొన్నిసార్లు ప్రాణాలను బలి తీసుకుంటాయి. ఉడకబెట్టిన కోడి గుడ్ల కోసం ఇద్దరు దంపతుల మధ్య జరిగిన గొడవ.. భార్య ప్రాణాలను బలి తీసుకుంది.
Wife Suicide | బెంగళూరు : దంపతుల మధ్య గొడవలు సహజమే. కానీ ఆ గొడవలు కొన్నిసార్లు ప్రాణాలను బలి తీసుకుంటాయి. ఉడకబెట్టిన కోడి గుడ్ల కోసం ఇద్దరు దంపతుల మధ్య జరిగిన గొడవ.. భార్య ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులోని మదనాయకనహళ్లి పోలీసు స్టేషన్ పరిధిలో మే 25వ తేదీన చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని దియోరియా జిల్లాకు చెందిన అనిల్ కుమార్ కుమార్ కోరి(35), పూజ(31) అనే దంపతులు బతుకుదెరువు కోసం బెంగళూరుకు కొన్నేండ్ల క్రితం వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు. మచహోహళ్లిలోని ఓ పెయింట్ ఫ్యాక్టరీలో అనిల్, పూజ పని చేస్తున్నారు. ఫ్యాక్టరీలోని బిల్డింగ్‌లోనే వారు నివాసం ఉంటున్నారు.
అయితే మే 25వ తేదీ రాత్రి భార్య కోడిగుడ్లను ఉడకబెట్టింది. తాను ఇంటి యజమానిని.. తనకు కోడిగుడ్లు ఎక్కువగా కావాలని పూజను అనిల్ ఆదేశించాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక అనిల్, ఇద్దరు పిల్లలు గాఢ నిద్రలోకి జారుకున్నాక పూజ అటు నుంచి వెళ్లిపోయింది. భార్య కనిపించకపోయేసరికి అనిల్ ఆందోళనకు గురయ్యాడు. స్థానికుల సహాయంతో అంతా వెతికాడు. బిల్డింగ్ ఆవరణలో రక్తపు మడుగులో ఉన్న పూజను చూసి అనిల్ షాక్‌కు గురయ్యాడు. బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి కిందకు దూకి పూజ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram