ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ!

విధాత (అమరావతి): సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు మెంబర్‌ ఆళ్ల భాగ్యలక్ష్మి నియామకంపై ప్రభుత్వ జీవోను సవాల్‌ చేస్తూ ఏపీ హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. దాడి దేవిని తొలగించడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న న్యాయస్థానం భాగ్యలక్ష్మి నియామకాన్ని సస్పెండ్‌ చేసింది. ఎనిమిది వారాలపాటు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి వరకు దాడి దేవిని కొనసాగించాలని, కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

  • Publish Date - May 11, 2021 / 04:09 AM IST

విధాత (అమరావతి): సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు మెంబర్‌ ఆళ్ల భాగ్యలక్ష్మి నియామకంపై ప్రభుత్వ జీవోను సవాల్‌ చేస్తూ ఏపీ హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. దాడి దేవిని తొలగించడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.

వాదనలు విన్న న్యాయస్థానం భాగ్యలక్ష్మి నియామకాన్ని సస్పెండ్‌ చేసింది. ఎనిమిది వారాలపాటు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి వరకు దాడి దేవిని కొనసాగించాలని, కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.