Lakshmi Devi Pooja | శుక్రవారం ఈ పనులు చేస్తున్నారా..? ‘లక్ష్మీదేవి’తో జర జాగ్రత్త..!
Lakshmi Devi Pooja | శుక్రవారం( Friday ) లక్ష్మీదేవి( Lakshmi Devi ) కి పూజ చేస్తున్నారా..? పూజ( Pooja ) చేస్తున్నామని చెప్పి దేవుళ్ల విగ్రహాలను శుభ్రం చేస్తున్నారా..? అయితే మీరు పొరపాటు చేస్తున్నట్టే.. లక్ష్మీదేవి కటాక్షం తగ్గినట్టే..!

Lakshmi Devi Pooja | హిందూ సంప్రదాయం( Hindu Custom )లో శుక్రవారానికి ఎంతో ప్రత్యేకత ఉంది. శుక్రవారాన్ని( Friday ) శుభదినంగా పరిగణిస్తారు. అనేక శుభకార్యాలకు శ్రీకారం చుడుతారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆ రోజున ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి( Lakshmi Devi )కి వైభవంగా పూజలు చేసి.. ఆర్థిక కష్టాలు( Financial Problems ) తొలగిపోవాలని, డబ్బులు సమకూరాలని ప్రార్థిస్తుంటారు. కానీ తెలిసో తెలియకో శుక్రవారం రోజున చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆర్థిక కష్టాలు సంభవిస్తాయని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు. మరి శుక్రవారం చేయాల్సిన పనులు.. చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం..
శుక్రవారం దేవుళ్ల ఫొటోలను శుభ్రం చేయొచ్చా..?
శుక్రవారం వచ్చిందంటే చాలు.. చాలా మంది మహిళలు తమ ఇంటిని వేకువజామునే శుభ్రపరుచుకుంటారు. ఆ తర్వాత పూజా కార్యక్రమాల్లో నిమగ్నమైపోతారు. పూజా గదిలో ఉన్న దేవుళ్ల చిత్రపటాలను, పూజా సామాగ్రిని శుభ్రం చేస్తుంటారు. మళ్లీ పసుపు కుంకుమలు పెట్టి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. కానీ శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి పనులు చేయకూడదు. పూజా గదిలో దేవుళ్ల విగ్రహాలు, పటాలను శుభ్రం చేసుకోవడానికి బుధ, గురు, ఆది సోమవారాలు మంచిది. శుక్రవారం శుభ్రపరిచే కార్యక్రమాలు చేపడితే లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి ఇల్లు విడిచి వెళ్లిపోతుందంట!
శుక్రవారం ఈ వస్తువులను బయట పడేయకూడదు..
చాలా మంది భక్తులు.. తమ ఇంట్లో విరిగిపోయిన దేవతల విగ్రహాలను, దేవుళ్ల పటాలను బయటకు తీసుకెళ్లి.. ఆలయంలో ఉన్న చెట్ల కిందనో, లేకుంటే మరో చోట వదిలిపెడుతుంటారు. కానీ ఈ పనులు శుక్రవారం చేయకూడదని శాస్త్రం చెబుతోంది. శుక్రవారం ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి కానీ బయటకు పంపితే దారిద్య్ర బాధలు తప్పవు.
శుక్రవారం అప్పుతో ముప్పులు..!
శుక్రవారం రోజు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. అప్పు తీసుకోకూడదు. ఒకవేళ ఎవరైనా అత్యవసరంగా డబ్బు అప్పుగా అడిగితే ఆర్థిక సహాయం చేయండి కానీ అప్పుగా ఇవ్వొద్దు. అలాగే ఎవరి నుంచి చేబదులు కానీ, అప్పు గాని తీసుకోకూడదు. అలా చేసే జీవితాంతం అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం.
శుక్రవారం లక్ష్మీ దేవిని ఎవరికి ఇవ్వరాదు
సాధారణంగా మనం బంధు మిత్రుల ఇళ్లల్లో శుభకార్యాలు జరిగినప్పుడు దేవుని విగ్రహాలు కానుకగా ఇస్తూ ఉంటాం. ఒకవేళ శుక్రవారం అలాంటి సందర్భం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీలక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవరికీ కానుకగా ఇవ్వకూడదని శాస్త్రం చెబుతోంది. శుక్రవారం మీ చేతితో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవరికైనా కానుకగా ఇస్తే మీ ఇంటి లక్ష్మిని వేరొకరికి అందజేసినట్లే అని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు.