చాలా మంది జ్యోతిష్యాన్ని నమ్ముతుంటారు. ఏ పని ప్రారంభించినా సరే తమ రాశుల ఫలితాలను బట్టి పనులను, శుభకార్యాలను ప్రారంభిస్తారు మరి ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేషం
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వినోదం కోసం ఎక్కువగా ధనవ్యయం చేస్తారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు మంగళకరంగా ఉంటుంది. వృత్తి నిపుణులకు, వ్యాపారులకు ప్రత్యేకంగా లాభదాయకమైన రోజు. ప్రమోషన్, జీతం పెరుగుదల సూచన ఉంది. ఇంట్లో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. సమాజంలో గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతాయి. ఆర్ధికంగా బలోపేతం అవుతారు.
మిథునం
మిధునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. శారీరకంగా, మానసికంగా నీరసం, నిరుత్సాహం ఆవరిస్తాయి. ఏ పని పట్ల ఆసక్తి లేకుండా నిరాసక్తంగా ఉంటారు. వ్యాపారులకు వ్యాపారంలో పురోగతి ఉండదు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. కష్టానికి తగిన ఫలితం ఉండదు.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు, వ్యాపారులు వ్యాపారంలో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. ఆర్థిక నష్టాలు సంభవించే సూచనలున్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వాదనలకు దూరంగా ఉండండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు మీ జీవితం మంచి మలుపు తిరుగుతుంది. బంగారు భవిష్యత్‌కు పునాది పడుతుంది. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. బంధు మిత్రులతో సంబంధాలు బలపడతాయి.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సృజనాత్మకతతో మీరు చేసే పనులు అందరిని ఆకట్టుకుంటాయి. మీరు ఎంచుకున్న రంగంలో అభివృద్ధి సాధించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
తుల
తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం మేలు. స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. మీ నోటి దురుసు తనం కారణంగా ఘర్షణలు జరిగే అవకాశముంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మేలు.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి శుభసమయం నడుస్తోంది. ఈ శుభ సమయాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తే సత్ఫలితాలు అందుకుంటారు. మీ జీవిత భాగస్వామితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఒక శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. వృత్తి ఉద్యోగాలలో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో అప్పుల పాలవకుండా చూసుకోండి. సహనంగా ఉంటే అనుకున్న గమ్యాన్ని చేరుకోగలరు. ఆర్థిక నష్టం సూచితం.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మీ మనోభీష్టం నెరవేరుతుంది. ఆర్ధిక లాభం, శత్రు జయం ఇలా ఎటు చూసినా అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. సమాజంలో కీర్తిని గడిస్తారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు తారాబలం బ్రహ్మాండంగా ఉంటుంది. పలు రకాల ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. విహారయాత్రలకు, తీర్థ యాత్రలకు వెళతారు. ఉద్యోగులు నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. విజయం ఒంటరిగా రాదు ధనలాభాలను వెంటబెట్టుకొని వస్తుంది.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చిత్తశుద్ధితో పనిచేసి మంచి విజయాలను అందుకుంటారు. ఓర్పుతో ఉంటే సమస్యలు తగ్గు ముఖం పడుతాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. తొందరపాటు నిర్ణయాల వలన నష్టం కలగవచ్చు.