Puja | ఇంట్లో దేవుడికి పూజ చేస్తున్నారా..? ఈ తప్పులు అసలు చేయకూడుదు..!
Puja | హిందూ మతంలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఒక్కో రోజు ఒక్కో దేవుడిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. వీలైతే ఆలయాలకు వెళ్తారు. లేదంటే ఇంట్లోనే దేవుళ్లకు పూజలు చేస్తుంటారు. నిష్టతో పూజించి కోరికలు కోరుకుంటారు. అయితే ఈ పూజ చేసే సమయంలో ఈ తప్పులు అసలు చేయకూడదు.

Puja | హిందూ మతంలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఒక్కో రోజు ఒక్కో దేవుడిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. వీలైతే ఆలయాలకు వెళ్తారు. లేదంటే ఇంట్లోనే దేవుళ్లకు పూజలు చేస్తుంటారు. నిష్టతో పూజించి కోరికలు కోరుకుంటారు. అయితే ఈ పూజ చేసే సమయంలో ఈ తప్పులు అసలు చేయకూడదు. ఈ తప్పులు చేస్తే ఎంత భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన ఫలితం దక్కదు. కాబట్టి పూజా సమయంలో ఈ నియమాలు తప్పకుండా పాటించాల్సిందే.
పాటించాల్సిన నియమాలు ఇవే..
- హిందూ మత గ్రంథాల ప్రకారం ఏ దేవుడినైనా పూజించేటప్పుడు దీపం, నీటి కుండలను పక్కపక్కనే ఉంచరాదు.
- దేవతలకు దీపం ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో పెట్టాలి. పూజకు ఉపయోగించే నీటీ పాత్రను ఈశాన్యంలో ఉంచాలి.
- దేవుడి పూజ కోసం వాడిపోయిన పువ్వులను ఉపయోగించకూడదు.
- దేవుడిని స్వచ్ఛమైన మనసుతో ఆరాధించాలి. భగవంతుడిని పూజించేటప్పుడు మనసు ఏ చెడు విషయాలపై వెళ్లకూడదు.
- అలాగే భగవంతుని ఆరాధించేటప్పుడు చిన్న పాటి గర్వం కూడా చూపించకూడదు. ఇలా గర్వం ప్రదర్శిస్తే పూజ ఫలితం ఉండదు.
- హిందూమతంలో ఏ దేవత పూజ కోసమైనా ఆసనాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శ్రమ లేకుండా నేలపై కూర్చొని పూజ చేస్తే ఫలితాలు తక్కువ అని వేద పండితుల విశ్వాసం.