Site icon vidhaatha

Vastu Tips | ఆ స‌మ‌యంలో మ‌హిళ‌లు బొట్టు పెట్టుకుంటే.. ఆ స‌మ‌స్య కొని తెచ్చుకున్న‌ట్టే..?

Vastu Tips | సింధూరం( Sindhuram ).. అదే బొట్టు( Bottu ).. వివాహిత మ‌హిళ‌ల‌కు( Married Woman ) ముఖ్య‌మైన అలంక‌ర‌ణగా ప‌రిగ‌ణించ‌బ‌డుతుంది. ఈ బొట్టును హిందూవులు ఎంతో ప‌విత్రంగా కూడా చూస్తారు. పెళ్లైన ప్ర‌తి మ‌హిళ విధిగా బొట్టు పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే.. నుదిటిన తిల‌కాన్ని( Tilakam ) దిద్దుకోవ‌డం వ‌ల్ల భ‌ర్త‌( Husband )కు ఆయుష్షు పెర‌గ‌డ‌మే కాకుండా.. ఆ ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీ( Positive Energy ) కూడా పెరుగుతుంద‌ట‌. కానీ ఒక్క స‌మ‌యంలో మాత్రం బొట్టు పెట్టుకోవ‌ద్ద‌ట‌. ఎందుకంటే ఆ స‌మ‌యంలో బొట్టు పెట్టుకుంటే ఆ ఇంట ఆర్థిక క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని వాస్తు శాస్త్ర నిపుణులు( Vastu Experts ) హెచ్చ‌రిస్తున్నారు. మ‌రి ఆ స‌మ‌యం ఏంటో తెలుసుకుందాం.

త‌ల స్నానం( Head Bath ) చేసిన వెంట‌నే మ‌హిళ‌లు బొట్టు పెట్టుకుంటే మంచిది కాద‌ట‌. త‌డి వెంట్రుక‌లు ఉన్న‌ప్పుడు బొట్టు పెట్టుకోవ‌ద్ద‌ని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. త‌డి శిరోజాలు ఉన్న‌ప్పుడు సింధూరం( Sindhuram ) పెట్టుకోవ‌డం కార‌ణంగా ఆర్థిక క‌ష్టాలు( Finance Problems ) వెంటాడుతాయ‌ట‌. జుట్టు ఆరిన త‌ర్వాత‌నే బొట్టు పెట్టుకుంటే అన్ని ర‌కాలుగా మంచి జ‌రుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

తడి వెంట్రుకలపై బొట్టు పెట్టుకోవ‌డంతో.. అన్ని సమయాలలో, సందిగ్ధతకు గురవ‌డ‌మే కాకుండా చెడు ఆలోచనలు మనస్సులో పెరుగుతాయట‌. అంతేకాదు సింధూరం దిద్దుకునేటప్పుడు, ఇతర స్త్రీలను సింధూరాన్ని తీసుకొని మీ ముఖాలపై పెట్టుకోవడం కూడా అనర్థాలకు దారి తీస్తుంద‌ని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీంతో భర్త ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంద‌ట‌. కాబ‌ట్టి ఈ రెండు నియ‌మాలు పాటిస్తే మీరు మీ భ‌ర్త‌కు ఎంతో మేలు చేసిన వార‌వుతారు.

Exit mobile version