Cloth Washing | రాత్రి వేళ బట్టలు ఉతుకుతున్నారా..? అయితే ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే..!
Cloth Washing | సిరుల తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు చాలా మంది మహిళలు నిత్యం పూజలు, వ్రతాలు చేస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో లక్ష్మీదేవి అనుగ్రహించదు. ఎందుకంటే.. మహిళలు చేసే చిన్న పొరపాట్ల కారణంగా.

Cloth Washing | సిరుల తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు చాలా మంది మహిళలు నిత్యం పూజలు, వ్రతాలు చేస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో లక్ష్మీదేవి అనుగ్రహించదు. ఎందుకంటే.. మహిళలు చేసే చిన్న పొరపాట్ల కారణంగా. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మహిళలు ఈ తప్పులు అసలు చేయకూడదు. లక్ష్మీకటాక్షం కలగాలంటే చేయకూడని తప్పులేంటో తెలుసుకుందాం.
చేయకూడని తప్పులు ఇవే..
- మహిళలు మంగళవారం పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్లకూడదు. శుక్రవారం కోడల్ని పుట్టింటికి పంపించకూడదట.
- లక్ష్మీ కటాక్షం కలగాలంటే గోళ్లను ఎప్పుడూ ఇంటి బయటే కత్తిరించుకోవాలి.
- సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడ్చడం, తల దువ్వుకోవడం చేయరాదట.
- అలాగే, పెరుగు, ఉప్పు వంటివి సూర్యాస్తమయం తర్వాత ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు.
- చాలా మంది చేసే మరొక తప్పు ఏంటంటే, మంచాల మీద పడుకున్నప్పుడు గోడకు పాదం పెట్టి మాట్లాడడం, నిద్రించడం చేస్తుంటారు. కానీ, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అలా చేయడం మంచిది కాదు.
- ఉదయం టైమ్ ఉండట్లేదని ఆఫీస్ నుంచి వచ్చాక ఇంటి పనులు పూర్తి చేసుకొని చాలా మంది రాత్రిపూట బట్టలు ఉతుకుతుంటారు. కానీ, ఇలా చేసినా లక్ష్మీ కటాక్షం తగ్గుతుందంటున్నారు జ్యోతిష్యులు.
- అదేవిధంగా, ఆడవారు ఒకరు ధరించిన వస్త్రాలు, ఆభరణాలు మరొకరు ధరించరాదు. ముఖ్యంగా ఫంక్షన్స్ టైమ్లో ఒకరి జ్యూయలరీ మరొకరు ధరిస్తుంటారు. కానీ, ఇలా ఒకరివి మరొకరు వేసుకోవడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని గుర్తుంచుకోవాలి.
- అలాగే, శనివారం ఉప్పు, నూనె కొనడం చేయవద్దంటున్నారు.
- నిత్య జీవితంలో ఇలా కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం ద్వారా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొంది, సమస్త శుభాలు, అష్టైశ్వర్యాలు సిద్ధింపచేసుకోవచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.