Vastu Tips for Key | ఇంటి తాళం చెవికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయి.. మీకు తెలుసా..!
Vastu Tips for Key | ఇంటి తాళం చెవి( House Key ).. ఇది ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. అయితే ఈ తాళం చెవి( Key )ని ఇంట్లో ఉంచే విషయంలో వాస్తు నియమాలు( Vastu Tips ) పాటించాలట. లేనిచో ఆ ఇంట అనేక సమస్యలు ఏర్పడి, ప్రతికూల వాతావరణం ఏర్పడే ఛాన్స్ ఉంటుందట.

Vastu Tips for Key | ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ ఇంటిని వాస్తు నియమాల( Vastu Tips ) ప్రకారం నిర్మించుకుంటున్నారు. చెప్పుల స్టాండ్ నుంచి మొదలుకుంటే బెడ్రూం( Bedroom )లో ఉంచే ప్రతి వస్తువు దాకా వాస్తు నియమాలు పాటిస్తున్నారు. ఇంట్లో ఉంచే ప్రతి వస్తువు పట్ల కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఆ ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆ గృహానికి కాపలాగా ఉండే తాళం చెవి( Key ) విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. తాళం చెవిని ఇంట్లో ఎక్కడంటే అక్కడ పడేస్తారు. అలా చేయడం సరికాదని వాస్తు నిపుణులు( Vastu Experts ) హెచ్చరిస్తున్నారు. ఇంటి తాళం చెవి( House Key )కి కూడా వాస్తు నియమాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. వాస్తు నియమాల ప్రకారం ఇంటి తాళం చెవిని ఉంచితే.. ఆ ఇంట అనేక శుభాలు కలుగుతాయని పండితులు పేర్కొంటున్నారు. మరి తాళం చెవికి ఉన్న వాస్తు నియమాలు ఏంటో తెలుసుకుందాం..
ఇంటిని భద్రంగా ఉంచే తాళం చెవి విషయంలో ఇంటి యజమానులు నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ, ఏ దిశలో అంటే ఆ దిశలో తాళం చెవిని ఉంచుతారు. అంటే వాస్తు నియమాలకు వ్యతిరేకంగా తాళం చెవిని పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందట. కాబట్టి ఇంట్లో ఎక్కడపడితే అక్కడ తాళం చెవి ఉంచే అలవాటు ఉంటే వెంటనే ఆ అలవాటుని మానుకోవాలని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేదంటే దీని పర్యవసానాలను అనుభవించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
తాళం చెవి ఉంచేందుకు పూజ గది సరైనదేనా..?
ఇంటిని సురక్షితంగా కాపాడే తాళం చెవిని పూజా గదిలో ఉంచితే మంచిదని చాలా మంది నమ్ముతుంటారు. దాంతో పూజ గదిలోనే తాళం చెవిని ఉంచుతుంటారు. కానీ పూజ గదిలో తాళం చెవి ఉంచరాదని వాస్తు శాస్త్రం చెబుతుంది. పూజ గదిలో తాళం చెవిని ఉంచడం కారణంగా ఆ ఇంట్లో సానుకూల శక్తిపై ప్రభావం చూపిస్తుందట.
ఈశాన్య దిశలో తాళం చెవిని ఉంచొచ్చా..?
ఈశాన్య మూల అనేది ఇంటి ముఖ్యమైన మూలల్లో ఒకటి. ఈ దిశ చాలా పవిత్రమైనదిగా కూడా పరిగణించబడుతుంది. ఇంటిలోని ఈశాన్య మూల ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. కనుక లోహ వస్తువువైన తాళం చెవులను పొరపాటున కూడా ఈశాన్య దిశలో పెట్టుకోకూడదు.
మరి తాళం చెవి ఉంచేందుకు ఏ దిశ సరైంది..?
ఇంటికి రక్షణగా ఉండే తాళం చెవి విషయంలో వాస్తు నియమాలు తప్పక పాటించాలి. కాబట్టి.. ఇంటి తాళం చెవిని వాస్తు ప్రకారం.. నైరుతి దిశలో ఉంచాలి. ఇలా చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుందట. నైరుతి దిశలో తాళం చెవిని ఉంచడంతో ఆ ఇంట్లో సిరిసంపదలు వర్ధిల్లుతాయట. ఎలాంటి సమస్యలు వచ్చే ఆస్కారం ఉండదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.