Horoscope | నేటి రాశిఫ‌లాలు.. ఈ రాశివారు శ‌త్రువుల‌పై విజ‌యం సాధిస్తారు..!

Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - September 13, 2024 / 06:40 AM IST

మేషం

మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు, ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. లేదంటే శత్రువులు పెరిగే ప్రమాదముంది. అది మీ పనిని మాత్రమేగాక మీ సంబంధాలను కూడా పాడుచేస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

వృషభం

వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుంది. ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం లేక నిరాశకు లోనవుతారు. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు.

మిథునం

మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆర్ధికంగా శుభ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు, ఆదాయం పెరుగుదల వంటి ప్రయోజనాలుంటాయి. స్నేహితులతో , కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధువుల రాకతో ఇంట్లో సంతోషం వెల్లి విరుస్తుంది. సంపద వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు.

సింహం

సింహ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించడం వల్ల ఈ రోజు సంతోషంగా గడుపుతారు. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. సన్నిహితులతో మంచి సమయం గడుపుతారు. సంతానం పురోగతి పట్ల సంతోషంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

కన్య

కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలం కాదు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా మానసికంగా శారీరకంగా చాలా ఒత్తిడి అనుభవిస్తుంటారు. ప్రియమైన వారితో కలహాల కారణంగా అశాంతితో ఉంటారు. ఆర్ధిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అధిక ఖర్చులు ఉండవచ్చు.

తుల

తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ శక్తి సామర్ధ్యాలను పూర్తిగా వెచ్చించి
తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంటారు. ఉద్యోగులకు శుభ సమయం నడుస్తోంది. పని పట్ల మీ అంకితభావానికి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు శుభకరంగా ఉంది.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఆర్ధికంగా కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటారు. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగితే మనస్పర్థలు ఏర్పడతాయి.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తవుతాయి. ఈ రాశి వారికి ఈ రోజు కార్యసిద్ధి, ఆర్థికవృద్ధి ఉంటాయి. కుటుంబసభ్యులతో తీర్థయాత్రలకు వెళతారు. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం వుంది. సమాజంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి.

మకరం

మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆటంకాలు ఎదురైనా సమయస్ఫూర్తితో, దైవబలంతో ఎదుర్కొంటారు. చేయని తప్పులకు నిందలు పడాల్సి వస్తుంది. కుటుంబ కలహాల కారణంగా సంబంధాలు దెబ్బతినవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.

కుంభం

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. లక్ష్య సాధనపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే ఆటంకాలను సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. ఆర్ధిక విషయాల్లో గందరగోళం నెలకొంటుంది. సహనం కలిగివుండాలి. వృధా ఖర్చులు పెరుగుతాయి.

మీనం

మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టం వరిస్తుంది. వృత్తి వ్యాపారాలలో చిత్తశుద్ధితో పనిచేసి తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంటారు. కొత్త పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి.