ప్రతి ఒక్కరూ జాతకాలను నమ్ముతుంటారు. దీంతో ప్రతి రోజు తమ రాశి ఎలా ఉంది..? అనే విషయాలను తెలుసుకుని తమ దినచర్యను ప్రారంభిస్తారు. కాబట్టి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ రాశిఫలాలు ఉన్నాయో తెలుసుకుందాం..
మేషం
మేషరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి. దీంతో నీరసంగా ఉంటారు. విశ్రాంతి అవసరం. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ప్రయాణాలు కూడా వాయిదా వేసుకుంటే మంచిది.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు ఫలవంతమైన రోజు. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అందరి సహకారం ఉంటుంది. వృత్తిఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి.
మిథునం
మిధునరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. ఆర్ధికంగా ఎలాంటి లోటు ఉండదు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం ద్వారా మేలు జరుగుతుంది.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ప్రతికూల ఆలోచనలు వీడి ప్రశాంతంగా ఉండండి. మాటలు అదుపులో పెట్టుకోకపోతే కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. ఇంట్లో అశాంతిగా ఉంటుంది.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. నూతన బాధ్యతలు చేపడతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అన్నింటా విజయమే ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధికంగా లాభపడతారు.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. మీ మొండి స్వభావంతో ఈ రోజు చాలా నష్టపోతారు. ఆత్మీయుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి.
తుల
తులారాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళతారు. విందువినోదాల్లో పాల్గొంటారు.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు ఆనందంగా గడిచిపోతుంది. గృహంలో శాంతి నెలకొంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి. ఒక శుభవార్త మీ ఆనందాన్నిరెట్టింపు చేస్తుంది.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన సమయం. అనేక రకాల అనారోగ్యాలు వేధిస్తాయి. పూర్తి విశ్రాంతి అవసరం. పనులు వాయిదా వేస్తే మంచిది.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యల కోసం ధనం ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో పనిచేసి అద్భుతాలు సృష్టిస్తారు. ఎటు చూసినా శుభాలే గోచరిస్తున్నాయి. ఇంట్లో శుభకార్యాల నిమిత్తం ధన వ్యయం ఉంటుంది.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మంచి ఆరోగ్యం, ఆర్ధిక లాభం ఉండడం వల్ల ఈ రోజంతా ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారు. అన్నింటా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి.