గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు కోపాన్ని అదుపులో ఉంచుకోక‌పోతే క‌ల‌హాలు త‌ప్ప‌వు..!

Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు కోపాన్ని అదుపులో ఉంచుకోక‌పోతే క‌ల‌హాలు త‌ప్ప‌వు..!

మేషం

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి కావడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సంపదలు కలిసి రావడంతో కుటుంబ వాతావరణం కూడా ఆనందభరితంగా ఉంటుంది. స్నేహితులు, ప్రియమైన వారిని కలుసుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు.

వృషభం

వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోవడంతో ప్రశాంతంగా ఉంటారు. స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతారు. ఉద్యోగంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. మీ శ్రమకు తగిన ఫలితం లేక నిరాశకు గురవుతారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు.

మిథునం

మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. స్నేహితుల ద్వారా ఆర్ధికంగా లబ్ది పొందుతారు. ఆర్ధికంగా ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. ప్రయాణాలు అనుకూలం. ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అందరి సహకారంతో కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగులకు అధిక పనిభారం కారణంగా అలసట ఉండవచ్చు. మిత్రుల సహకారంతో పనిభారం తగ్గుతుంది. ఇంటి అలంకరణ కోసం ధనవ్యయం చేస్తారు.

సింహం

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ శక్తి, సామర్ధ్యాలను తక్కువగా అంచనా వేసుకోవద్దు. ఏదైనా సాధించగల మీ ప్రతిభను పూర్తిగా వినియోగించుకుంటే పెద్ద పెద్ద డీల్స్ ను ఈ రోజు సునాయాసంగా సాధిస్తారు. ఆర్ధికంగా మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేస్తారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

కన్య

కన్యా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కుటుంబంతో మీ బంధం దృఢపడుతుంది. బంధు మిత్రుల సహకారంతో ఒక ముఖ్యమైన వ్యవహారంలో విజయం సాధిస్తారు. స్నేహితులు, బంధువులను కలిసి పరస్పర శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది.

తుల

తులా రాశి వారికి ఈ రోజు ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఎన్నడూ లేనంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడటంతో ఆందోళనల సుడిగుండంలో చిక్కుకున్నట్లుగా అనిపిస్తుంది. సంతానంతో ఏర్పడిన విబేధాలు తీవ్రంగా బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కూడా పరిస్థితి అంత అనుకూలంగా ఉండదు. వ్యాపారంలో తీవ్ర నష్టాల కారణంగా మానసిక క్షోభకు గురవుతారు.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. కుటుంబ సమస్యలు, పనిలో ఒత్తిళ్లు కారణంగా అశాంతి, చికాకుతో ఉంటారు. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే కలహాలు తప్పవు. ఆర్ధిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా ఉండండి.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ అభిరుచికి తగిన పని చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. వృత్తి పరంగా నైపుణ్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సమీప బంధువులలో కొందరి ప్రవర్తన మనస్తాపం కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.

మకరం

మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల మద్దతుతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారంలో పట్టిందల్లా బంగారం కావడంతో మంచి లాభాలు అందుకుంటారు.

కుంభం

కుంభ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. కొత్త పనులు, ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉత్సాహం చూపిస్తారు. అందరి దృష్టిని ఆకట్టుకుంటారు. ముఖ్యమైన విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. సమయానుకూలంగా వ్యవహరిస్తే మంచిది. కుటుంబ సమస్యల పట్ల ఆచి తూచి వ్యవహరించాలి.

మీనం

మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనవసర ఆందోళనలు మీ పనిని మరింత ఆలస్యం చేస్తాయి. నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యాన్ని తగ్గిస్తాయి. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. భూమి లేదా ఆస్తికి సంబంధించిన చర్చలు వాయిదా వేస్తే మంచిది. మీ వ్యక్తిత్వానికి, కుటుంబానికి చెడ్డ పేరు తీసుకువచ్చే పరిస్థితులకు దూరంగా ఉండండి.