ఈ రోజు మీ రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

ఈ రోజు మీ రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం

మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ ఆస్తులకు సంబంధించి ఒకింత ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. ఖర్చులు అదుపులో ఉంటాయి.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు తారాబలం అదృష్ట దాయకంగా ఉంది. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

మిథునం

మిధున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో అప్రమత్తంగా ఉంటే మేలు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. బంధు మిత్రులతో తీర్ధయాత్రలకు వెళతారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం అంతగా సహకరించదు. రుణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులకు పనుల్లో ఆలస్యం చికాకు కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మీ సానుకూల దృక్పధం మీ విజయానికి బాటలు వేస్తుంది. స్థిరాస్తి కొనుగోలుకు శుభసమయం. ఆరోగ్యం సహకరిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కన్య

కన్యా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ప్రతికూల ఆలోచనలు వీడండి. పై అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ ఇది తాత్కాలికమే! మీ ప్రతిభతో వారిని మెప్పిస్తారు.

తుల

తులారాశి వారికి ఈ రోజు వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. వేసే ప్రతి అడుగు ఆచి తూచి వేస్తె మేలు. ఎవరితోనూ వాదనల్లోకి దిగవద్దు. వివాదాలు, అనారోగ్యం, కోపం కారణంగా ఈ రోజంతా అశాంతిగా ఉండవచ్చు. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. బాధ్యతలు, తీరిక లేని పనుల నుంచి విశ్రాంతి తీసుకోండి. స్నేహితులతో సరదాగా, సంతోషంగా గడపండి. విందు వినోదాల్లో పాల్గొనండి. ఆర్ధిక పరమైన ప్రయోజనాలు ఉంటాయి.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిలో ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగులతో సానుకూలత లోపిస్తుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. కోపాన్ని తగ్గించుకొని సహనంతో ఉండండి. వివాదాలకు దూరంగా ఉంటేనే మేలు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉన్నత విద్యావకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఆస్తికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించండి.

మీనం

మీన రాశి వారికి ఈ రోజు తారాబలం అనుకూలంగా ఉంది కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. సృజనాత్మకతతో, దృఢ నిశ్చయంతో పనిచేసి విజయాన్ని అందుకుంటారు. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు.