Lord Hanuman | మంగ‌ళ‌వారం ఈ మంత్రం జ‌పిస్తే.. వ్యాపారంలో లాభం, ఉద్యోగంలో ప్ర‌మోష‌న్ ఖాయం..!

Lord Hanuman | హిందువులు ప్ర‌తి మంగ‌ళ‌వారం హ‌నుమంతుడిని పూజిస్తుంటారు. తెల్ల‌వారుజామునే భ‌క్తులు నిద్ర మేల్కొని, ఇల్లును శుభ్రం చేసుకుని ఆంజ‌నేయుడిని ఆరాధిస్తుంటారు. వీలైతే హనుమాన్ ఆల‌యాల‌కు వెళ్లి.. ప్ర‌ద‌క్షిణ‌లు చేసి పూజ‌లు చేస్తారు. హ‌నుమాన్ చాలీసా కూడా ప‌ఠించి.. త‌మ‌కు ఎలాంటి ఆటంకాలు క‌ల‌గ‌కుండా చూడాల‌ని ఆ వాయు పుత్రుడిని ప్రార్థిస్తుంటారు.

Lord Hanuman | మంగ‌ళ‌వారం ఈ మంత్రం జ‌పిస్తే.. వ్యాపారంలో లాభం, ఉద్యోగంలో ప్ర‌మోష‌న్ ఖాయం..!

Lord Hanuman | హిందువులు ప్ర‌తి మంగ‌ళ‌వారం హ‌నుమంతుడిని పూజిస్తుంటారు. తెల్ల‌వారుజామునే భ‌క్తులు నిద్ర మేల్కొని, ఇల్లును శుభ్రం చేసుకుని ఆంజ‌నేయుడిని ఆరాధిస్తుంటారు. వీలైతే హనుమాన్ ఆల‌యాల‌కు వెళ్లి.. ప్ర‌ద‌క్షిణ‌లు చేసి పూజ‌లు చేస్తారు. హ‌నుమాన్ చాలీసా కూడా ప‌ఠించి.. త‌మ‌కు ఎలాంటి ఆటంకాలు క‌ల‌గ‌కుండా చూడాల‌ని ఆ వాయు పుత్రుడిని ప్రార్థిస్తుంటారు. మ‌రి ముఖ్యంగా వ్యాపారంలో లాభాలు పొందాల‌న్నా, మ‌నం చేస్తున్న ఉద్యోగంలో ప్ర‌మోష‌న్ ద‌క్కాల‌న్నా.. అలాగే పోటీ ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధించాల‌న్నా.. మంగ‌ళ‌వారం హ‌నుమాన్ ఆల‌యంలో ఈ మంత్రం జ‌పిస్తే.. కోరిన కోరిక‌ల‌న్నీ నెర‌వేరుతాయ‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అలాంటి మ‌హ‌త్త‌ర‌మైన‌టువంటి మంత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

హ‌నుమాన్ ఆల‌యంలో జ‌పించాల్సిన మంత్రం ఇదే..

ఆంజ‌నేయం మ‌హ‌వీరం..!
బ్ర‌హ్మ విష్ణు శివాత్మ‌కం..!
అరుణార్కం ప్ర‌భుం శ‌మ‌థం..!
రామ‌దూతం న‌మామ్య‌హం..!

11 ప్ర‌ద‌క్షిణ‌లు చేయాల్సి ఉంటుంది..

ఆంజ‌నేయ స్వామి ఆల‌యంలో పై మంత్రం జ‌పించిన త‌ర్వాత‌.. మొత్తం 11 ప్ర‌ద‌క్షిణ‌లు చేయాల్సి ఉంటుంది. దీంతో ఆంజ‌నేయుడి కృపాక‌టాక్షాలు పొందే అవ‌కాశం ఉంటుంది. వివిధ రంగాల్లో మీరు విజ‌యం సాధించే అవ‌కాశం ఉంది. అనారోగ్యాల‌తో బాధ‌ప‌డేవారు కూడా ఈ మంత్రాన్ని జ‌పిస్తే.. ఆ రోగం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించ‌నుంది. అంతేకాదు భూతప్రేత పిశాచాల నుంచి కూడా ఈ మంత్రం చ‌ద‌వ‌డం ద్వారా ముప్పు తొల‌గిపోతోంది. ఈ మంత్రం చ‌దివిన అనంత‌రం.. హ‌నుమంతుడికి ఎంతో ఇష్ట‌మైన సింధూరం నుదుటిన ధ‌రించి మీ ప‌నుల‌ను ప్రారంభిస్తే త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తారు.