చాలా మంది జ్యోతిష్యాన్ని నమ్ముతుంటారు. ఏ పని ప్రారంభించినా సరే తమ రాశుల ఫలితాలను బట్టి పనులను, శుభకార్యాలను ప్రారంభిస్తారు మరి ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేషం
మేషరాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు పురోగతి ఉంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ధనలాభం ఉంటుంది. ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి. వ్యాపారులకు శత్రుజయం, రుణ విమోచనం ఉంటుంది.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ నాటి నుంచి వృషభ రాశిలో బృహస్పతి సంచారం ఉన్నందున పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. ఈ రాశి వారు దూర దేశాలకు, తీర్థయాత్రలకు ప్రయాణం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు గ్రహసంచారం బాగాలేదు కాబట్టి అన్ని విషయాలలో అప్రమత్తంగా ఉండడం మేలు. అశుభకరమైన సంఘటనలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్నవారు వీలైనంత వరకు ఈ రోజు శస్త్ర చికిత్స వాయిదా వేస్తే మంచిది. ధన నష్టం సూచితం.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తిపరంగా పలు ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థికంగా లాభపడతారు. సమాజంలో గౌరవం, ప్రఖ్యాతులు పెరుగుతాయి.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఇంట్లో గొడవలు, కలహాలతో మనశ్శాంతి లోపిస్తుంది. గ్రహసంచారం బాగోలేదు కాబట్టి ముఖ్యమైన పనులన్నీ వాయిదా వెయ్యండి. ఏది ఏమైంగా ధైర్యంగా ఉండండి. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. వ్యాపారులు పెట్టుబడులు పెట్టేముందు బాగా ఆలోచించుకోవాలి. మోసం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులు విజయం కోసం తీవ్రమైన కృషి చేయాలి. ఖర్చులు పెరుగుతాయి.
తుల
తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. మీ గత తప్పిదాలకు ఫలితం ఈ రోజు అనుభవిస్తారు. మీ తల్లిగారి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంటుంది. వ్యాపారులు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. కొన్ని వ్యవహారాల్లో అవమానకరంగా మారే పరిస్థితుల నుంచి దూరంగా ఉండండి.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు అదృష్టవంతంగా ఉంటుంది. అన్ని రకాల వృత్తి వ్యాపారాలు చేసే వారిని ఈ రోజు అదృష్టం వరిస్తుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఆర్థిక సంబంధమైన విజయం ఉంది. అన్ని వైపులా అదృష్టం కలిసి వస్తుంది. అనుకోని విజయం, ఆకస్మిక ధనలాభం మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఏ విషయంలోనూ నిర్లక్ష్యం కూడదు. జీవిత భాగస్వామితో స్వల్ప ఘర్షణలకు అవకాశముంది. సహనంతో ఉంటే మేలు. కోపంలో మాటలు అదుపు తప్పితే సంబంధాలు దెబ్బ తింటాయి. మానసికంగా దృఢంగా ఉండండి.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈ రోజు ఆధ్యాత్మిక సంబంధమైన కార్యకలాపాలలో గడుపుతారు. వ్యాపారులు, ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రయత్నాలు, బాధ్యతలు, కర్తవ్యాలూ అన్నీ ఫలిస్తాయి. గృహంలో శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి. ఆరోగ్యం బాగుంటుంది.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అన్ని రకాల వృత్తి వ్యాపార రంగాల వారికి అనుకూలంగా ఉంది. అద్భుతమైన వాక్చాతుర్యంతో పలువురి ప్రశంసలు అందుకుంటారు. అనవసర వాదనలకు దూరంగా ఉండండి. ఆర్థికంగా మెరుగుపడతారు.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తను వింటారు. వ్యాపారులకు ఏర్పడే కొత్త పరిచయాలు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటాయి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు.