30 జూన్ నుంచి 6 జులై వ‌ర‌కు.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - June 30, 2024 / 06:31 AM IST

మేషం

మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢపడుతుంది. అవివాహితులకు వివాహం నిశ్చమవుతుంది. వృత్తి వ్యాపార రంగాల వారు వృత్తి పట్ల అంకితభావంతో పనిచేసి గొప్ప విజయాలను సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ప్రభుత్వ పరంగా నిలిచి ఉన్న పెండింగు డబ్బులు చేతికి అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు, ఆదాయ వృద్ధి వంటి ప్రయోజనాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభ ఫలితాలు ఉంటాయి.

వృషభం

వృషభ రాశి వారికి ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులకు ఈ వారం విశేషమైన ఫలితాలు ఉంటాయి. వారం మధ్యలో పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చి పెడతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు వివాహబంధంతో ఒక్కటవుతారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు మెరుగవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్, బదిలీకి అవకాశం ఉంది. స్థిరాస్తి రంగం వారికి అదృష్టం వరిస్తుంది. నూతన ప్రాజెక్టులను చేపడతారు. విద్యార్థులు చదువు పట్ల మరింత ఏకాగ్రత పెడితే మంచిది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మిథునం

మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో స్వల్ప విజయాలను అందుకుంటారు. వ్యాపారులకు పనిలో పురోగతి ఉంటుంది. పెట్టుబడుల మీద రాబడి కూడా బాగుంటుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. ఉన్నతాధికారులు మీ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి యోగం ఉంటుంది. సంపద వృద్ధి చెందుతుంది. గృహంలో శాంతి సంతోషం నెలకొంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. దూర ప్రాంతాలనుంచి శుభవార్తలు అందుకుంటారు. గృహంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. వృత్తి నిపుణులకు, వ్యాపారస్తులకు మెరుగైన ఫలితాలు ఉంటాయి. పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికినీ సమర్థతతో అధిగమిస్తారు.

సింహం

సింహరాశి వారికి ఈ వారం శుభకరంగా ఉంటుంది. వృత్తి నిపుణులు, వ్యాపారులు వృత్తి పరంగా మంచి పురోగతి సాధిస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. పెట్టుబడుల రూపంలో ధనాదాయం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. గృహంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. సమాజానికి మేలు చేసే పనులు చేపడతారు. విద్యార్థులు విద్యాపరంగా గొప్ప విజయాలు సాధిస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

కన్య

కన్యా రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పురోగతి అస్థిరంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరగడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్యం దెబ్బ తింటుంది. వ్యాపారులు సమయానుకూలంగా నడుచుకుంటే వ్యాపారంలో పురోగతి సాధించవచ్చు. ప్రత్యర్థులపై ఓ కన్నేసి ఉంచడం మంచిది. వ్యక్తిగత జీవితంలో సమస్యలు తలెత్తవచ్చు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపండి.

తుల

తులరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారికి శ్రమకు తగిన ఫలం ఉండకపోవచ్చు. కుటుంబంలో కలహాలు, మనస్పర్థలు చోటు చేసుకుంటాయి. వ్యాపారులు స్వల్ప విజయాలను చూస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం ఆందోళనకు గురి చేస్తుంది. వ్యాపారులకు సాధారణమైన ఫలితాలే ఉంటాయి. ఖర్చులు స్వల్పంగా పెరిగినప్పటికీ ఆదాయం సంతృప్తికరంగా కొనసాగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పని ప్రదేశంలో ఊహించని మార్పులు, అనుకోని సవాళ్లు ఎదురవుతాయి. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలం. అయితే సమష్టి నిర్ణయాలతో ముందుకెళ్తేనే మేలు జరుగుతుంది. జీవిత భాగస్వామితో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. సంతానం పురోగతి ఆనందాన్ని కలిగిస్తుంది. ఖ‌ర్చులు అదుపులో ఉంటాయి.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ వారం విజయవంతంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి ఉద్యోగ రంగాల వారికి ఆశించిన శుభ ఫలితాలు ఉంటాయి. ఆదాయం పదింతలు పెరుగుతుంది. వ్యాపారులు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. సంతృప్తికరమైన లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ప్రయాణాలు అనుకూలం. పితృవర్గం నుంచి శుభవార్తలు అందుకుంటారు.

మకరం

మకరరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల వారికి తీవ్రమైన శ్రమ, పని ఒత్తిడి ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితులు దిగజారవచ్చు. ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలహాలు, అపార్థాలు చోటు చేసుకుంటాయి. సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. వ్యాపారులు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. మానసిక ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనులను వాయిదా వేస్తే మంచిది. విద్యార్థులు చదువులో రాణిస్తారు.

కుంభం

కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగాల వారు పని పట్ల ఏకాగ్రత లోపించడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. ఆలోచనలు పక్కదారి పట్టడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తి పట్ల అంకితభావం, శ్రద్ధ అవసరం. వ్యాపారులకు సామాన్య ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు తమ చదువులపై దృష్టి సారించి మంచి విజయాలు పొందుతారు. ఆరోగ్యం సహకరించదు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.

మీనం

మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. సమయానుకూలంగా నడుచుకుంటే ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించవచ్చు. ఉద్యోగులు పని తీరు పట్ల ఉన్నతాధికారులు సంతృప్తితో ఉంటారు. వ్యాపార రంగాల వారికి పెట్టుబడులు, లాభాల రూపంలో ధన ప్రవాహం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రుల రాకతో సందడిగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి జీతంతో ఉద్యోగం దొరుకుతుంది.

Latest News