Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. ఈ రాశుల వారు జీవిత భాగ‌స్వామితో మధుర‌క్ష‌ణాలు గ‌డుపుతారు..!

Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. త‌మ‌ రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన, వార‌ ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. ఈ రాశుల వారు జీవిత భాగ‌స్వామితో మధుర‌క్ష‌ణాలు గ‌డుపుతారు..!

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ వారం శుభకరంగా ఉంటుంది. గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో సమర్థవంతమైన పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో సహనంతో ఉండడం అవసరం. ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు తొలగిపోతాయి. ఉద్యోగులు స్థిరత్వం సాధిస్తారు. పదోన్నతులకు అవకాశం ఉంది. ఆర్థిక స్థిరత్వం సాధించడం కోసం ఖర్చులు అదుపు చేయండి. ప్రయాణాలు అనుకూలం. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో గత విభేదాలను పక్కన పెట్టి సత్సంబంధాల కోసం కృషి చేయడం మంచిది. ఉద్యోగుల శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. వ్యాపారవేత్తలు ఆర్థిక లాభాలను పొందవచ్చు. కుటుంబంలో సామరస్య వాతావరణం కోసం కృషి చేస్తే మంచిది. ఈ వారం ప్రయాణానికి అనుకూలం కాదు. ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వైవాహిక జీవితంలో మనస్పర్థలు, అపార్థాలను అవగాహనతో తొలగించుకోవచ్చు. ఉద్యోగులకు శుభ సమయం నడుస్తోంది. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు అధికంగా ఉండడం వల్ల ఆర్థిక పరమైన ఒత్తిడి ఏర్పడవచ్చు. ఆర్థిక లావాదేవీలు తెలివిగా నిర్వహించుకోవడం అవసరం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. వారాంతంలో ప్రయాణాలు అనుకూలం.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో ఆనందం ఉంటుంది. ఉద్యోగులు పట్టుదలతో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వ్యాపారులు వారం ప్రారంభంలో కొత్త ప్రాజెక్టులకు దూరంగా ఉంటే మంచిది. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. బంధు మిత్రులతో మంచి సమయం గడపడం మానసిక ప్రశాంతతను అందిస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. వారం మధ్యలో ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా శుభవార్తలు వింటారు. చేపట్టిన పనుల్లో సానుకూల ఫలితాలు ఉండడంతో ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఇది మీ బంధాన్ని పటిష్టం చేస్తుంది. వృధా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఉద్యోగంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. పదోన్నతులు పొందుతారు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెట్టాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆరోగ్య కరమైన జీవనశైలితో అనారోగ్య సమస్యలను నివారించవచ్చు.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. వ్యాపారులు వ్యాపారాన్ని విస్తరించడంలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సోదరుల మధ్య కొనసాగుతున్న విభేదాలు ముగుస్తాయి. విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత పెట్టాలి.

తుల (Libra)

తులరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున చేపట్టిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. వృత్తి వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కెరీర్ విజయపథంలో దూసుపోవడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు, కోరుకున్న స్థానానికి బదిలీ పొందే అవకాశం ఉంది. ఆదాయం పదింతలు పెరుగుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. కుటుంబ విషయాలలో జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇస్తే కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. కొన్ని ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు కొన్ని సవాళ్లను ఎదుర్కొనే అవకాశముంది. కానీ పట్టుదలతో వ్యవహరిస్తే విజయాన్ని సాధించవచ్చు. వ్యాపారులు వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు. అయితే కీలక పెట్టుబడులను వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులు అడ్డంకులను అధిగమించి విజయానికి చేరువవుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. వారం ఆరంభంలో ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. ప్రేమ విషయాల్లో స్థిరత్వం ఉంటుంది. జీవిత భాగస్వామితో మధుర క్షణాలను గడుపుతారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వృతి వ్యాపారాలలో మెరుగైన ప్రయోజనాలు పొందాలంటే తీవ్ర కృషి అవసరం. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. తీవ్రమైన అనారోగ్య సమస్యల కారణంగా ఏ పనిపై దృష్టి సారించలేకపోతారు. వ్యాపారులు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. ఆర్థిక సంబంధిత విషయాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మేలు. స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు న్యాయపరమైన సలహాలు తీసుకోండి. చట్టపరమైన ఇబ్బందులు, న్యాయపరమైన చిక్కులు ఉండవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ వారం ఫలప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్ట్‌లు, భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించేందుకు అనువైన సమయం. ఆర్థిక వృద్ధి ఉంటుంది. రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టడం అవసరం. వారం చివరిలో ప్రయాణం అనుకూలంగా ఉంటుంది.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించాలి. కెరీర్ పరంగా, ఉద్యోగులు తమ పనిలో స్థిరత్వాన్ని పొందుతారు. కొత్త అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు సత్ఫలితాలు అందుకుంటారు. వ్యాపారులు అధిక లాభాల కోసం నూతన వ్యూహాలను అనుసరించాలి. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. కుటుంబంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అవివాహితులకు వివాహ సూచన ఉంది.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా, ఉద్యోగులు కొత్త బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. అయితే కొన్ని సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉంటుంది. వ్యాపారంలో ఈ వారం స్థిరమైన వృద్ధిని ఆశించవచ్చు. ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ఖర్చులు అదుపులో ఉంచాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు విజయం సాధించాలంటే పట్టుదల, ఏకాగ్రత అవసరం. పాత అనారోగ్య సమస్యలు తిరగబెట్టే అవకాశం ఉంది. కాబట్టి అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాలు అనుకూలం కాదు కాబట్టి ముఖ్యమైన ప్రయాణాలను వాయిదా వేయడం ఉత్తమం. జీవిత భాగస్వామితో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు.