AP Inter results | నేడే ఏపీ ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలు..
AP Inter results : ఆంధప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఇవాళ (శుక్రవారం) వెల్లడించనున్నారు. ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది. ఉదయం 11 గంటలకు ఫలితాల ప్రకటన ఉంటుందని తెలిపింది. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యా కార్యాలయంలో నుంచి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
కాగా, 2023-2024 విద్యా సంవత్సరానికిగాను ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 9.99 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 1 నుంచి 20 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఏప్రిల్ 4 నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయ్యింది. ఫస్టియర్‌కు సంబంధించి 5,17,617 మంది, సెకండియర్‌కు సంబంధించి 5,35,056 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు.
వారిలో 9,99,698 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వాళ్లలో ఎంత మంది ఉత్తీర్ణులు కానున్నారనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. కాగా ఫలితాలను https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని ఏపీ ఇంటర్మీడియట్ విద్యామండలి తెలిపింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram