• Telugu News
  • /Edu career

ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల

ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి నారా లోకేశ్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 6.30 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 85.25 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. ఫలితాలలో బాలికలదే పైచేయిగా నిలిచింది.

Reported by: Y.V. Narsimha Reddy | విద్య - ఉద్యోగం | Apr 30, 2026, 12:17 pm IST
Read Time: 3 mins
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల

అమరావతి : ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి నారా లోకేశ్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 6.30 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 85.25 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. ఫలితాలలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బాలికలు 87.90% ఉత్తీర్ణత, బాలురు 82.68% ఉత్తీర్ణత సాధించారు. బాలురుతో పోలిస్తే 5.22 శాతం అధికంగా బాలికలు ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల్లో 78.39శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 2,161 పాఠశాలల్లో వందశాతం, 16 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది.

96.07 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. 57.12 శాతంతో అల్లూరి జిల్లా చివరిస్థానంలో నిలిచింది. ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఈసారి అత్యధికంగా 96.04శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాలను results.bse.ap.gov.in వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే, మనమిత్ర వాట్సప్‌ నంబర్‌ 9552300009కు ‘Hi’ అని మెసేజ్ చేయడం ద్వారా కూడా ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు.

పదో తరగతి పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్స్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. మే 25 నుంచి జూన్‌ 4 తేదీల మధ్య వీటిని నిర్వహించనున్నారు. మే 1 నుంచి 9 వరకు పరీక్ష ఫీజు చెల్లించడానికి అవకాశం ఇచ్చారు. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ కోసం అప్లై చేయడానికి మే 1 నుంచి 7 వరకు అవకాశం కల్పించారు.

ఇవి కూడా చదవండి :

HMWSSB | హైద‌రాబాదీల‌కు అల‌ర్ట్.. మే 2న తాగునీటి స‌ర‌ఫ‌రా బంద్..!
Mini Cooper | స్పోర్టీ లుక్‌తో సరికొత్త మినీ కూపర్.. ధర ఎంతంటే..!