Nidhi Agerwal : హీరోయిన్ నిధి అగర్వాల్ పై అసభ్య ప్రవర్తన..పోలీస్ కేసు నమోదు
హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో కేపీహెచ్‌బీ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించిన శ్రేయాస్ మీడియా, లూలు మాల్‌పై చర్యలు.
విధాత, హైదారబాద్ : ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా రెండో సింగిల్ ‘సహన సహన’సాంగ్ లాంచ్ ఈవెంట్ సందర్బంగా హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన ఘటనపై కేపీహెచ్ బీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి శ్రేయాస్ మీడియా, లూలు మాల్ యజమాన్యంపై కేసు నమోదు చేశారు. యువకుల అసభ్య ప్రవర్తనపై హీరోయిన్ నిధి ఫిర్యాదు చేస్తే మరో కేసు నమోదు చేసి పోకిరీను గుర్తిస్తామని పోలీసులు వెల్లడించారు.
ఈనెల 17న సాయంత్రం ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోని లూలు మాల్‌లో నిర్వహించారు. ఈవెంట్ ముగింపు సందర్భంగా నటి నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నిధి అగర్వాల్‌పై కొందరు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈవెంట్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్‌తో సెల్ఫీల కోసం అభిమానులు హద్దులు దాటి ప్రవర్తించడంతో ఆమె అసౌకర్యానికి గురయ్యారు. కొందరు యువకులు ఆమెను తాకేందుకు ప్రయత్నించారు. బౌన్సర్లు అతికష్టం మీద ఆమెను అక్కడి నుంచి పంపించారు. హీరోయిన్ నిధి అగర్వాల్ కు ఎదురైన ఇబ్బందికర పరిస్థితికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అంశం పోలీసులు స్పందించారు. కేపీహెచ్‌బీ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.
అసలు ఈవెంట్ నిర్వహణకు ఈవెంట్ మేనేజర్ ఎలాంటి అనుమతి తీసుకోలేదని పోలీసులు వెల్లడించారు. పోలీసు బందోబస్తు లేకపోవడంతో హీరోయిన్ నిధి అగర్వాల్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని…అందువల్లే తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడిందని కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్ ఎస్.రాజశేఖర్ రెడ్డి తెలిపారు. అనుమతి లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించిన కారణంగా మాల్ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Hyderabad Book Fair : నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ షురూ
Pawan Kalyan | సుజిత్‌కు పవన్ కళ్యాణ్ లగ్జరీ కార్ గిఫ్ట్‌గా ఇవ్వడం వెనుక అసలు కథ ఇదే!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram