Akhanda 2 | ‘అఖండ 2’ కొత్త డేట్‌తో చిత్ర విచిత్రంగా చిన్న సినిమాల పరిస్థితి.. ఎన్ని వెనక్కి తగ్గాయి?
Akhanda 2 | ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2: తాండవం’ సినిమా డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 12కి వాయిదా పడటంతో, అదే తేదీని లక్ష్యంగా పెట్టుకున్న చిన్న, మధ్యస్థాయి సినిమాల రిలీజ్ ప్లాన్లు గందరగోళంలో పడ్డాయి.
Akhanda 2 | ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2: తాండవం’ సినిమా డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 12కి వాయిదా పడటంతో, అదే తేదీని లక్ష్యంగా పెట్టుకున్న చిన్న, మధ్యస్థాయి సినిమాల రిలీజ్ ప్లాన్లు గందరగోళంలో పడ్డాయి. బాలయ్య సినిమాతో పోటీ పడలేక పలు చిత్రాలు తేదీలు మార్చుకోవాల్సి వస్తుంది. అయితే కొత్తగా మంచి స్లాట్ దొరుకుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కార్తీ ‘అన్నగారు వస్తారు’ వెనక్కి వెళ్లలేదు
కార్తీ, కృతి శెట్టి జంటగా నటించిన ‘అన్నగారు వస్తారు’ సినిమా మాత్రం అదే తేదీ (డిసెంబర్ 12)లోనే థియేటర్లలోకి రానుంది. ప్లాన్ ప్రకారం ఈ చిత్రం డిసెంబర్ 5కి రావాల్సి ఉన్నా, ‘అఖండ 2’ కారణంగా 12కి మారింది. ఇప్పుడు మళ్లీ అదే రోజు బాలయ్య సినిమా వస్తున్నా… ‘అన్నగారు వస్తారు’ మూవీ యూనిట్ వెనక్కి వెళ్లే ఆప్షన్ లేకుండా అదే తేదీతో ముందుకు సాగుతోంది. తెలుగు–తమిళ భాషల్లో ఒకేరోజు రిలీజ్ ప్లాన్ అలాగే కొనసాగుతోంది.
నందు హీరో ‘సైక్ సిద్ధార్థ్’ జనవరి 1కి
నందు హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘సైక్ సిద్ధార్థ్’ కూడా డిసెంబర్ 12 రిలీజ్ కోసం రెడీ అయ్యింది. కొద్ది రోజులుగా నందు జోరుగా ప్రమోషన్లు చేస్తూ సినిమాకు మంచి బజ్ తెచ్చాడు. డిసెంబర్ 12న ‘అఖండ 2’ రాకూడదని నందు కోరుకున్నా, చివరికి పరిస్థితులు మారలేదు. దీంతో ఈ సినిమా 2026 జనవరి 1న విడుదలకు సిద్ధమైంది.
రోషన్ నటించిన ‘మోగ్లీ’… ఒక్కరోజు వాయిదా
సుమ–రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ హీరోగా, ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘మోగ్లీ’ కూడా మొదట డిసెంబర్ 12నే రానుందని చెప్పారు. అయితే ‘అఖండ 2’ వాయిదా నేపథ్యంలో ఈ సినిమా కూడా తాత్కాలికంగా వాయిదా పడిపోయింది. దర్శకుడు సందీప్ రాజ్ మొదట నిరాశ వ్యక్తం చేసినా, ఆ తర్వాత మరో ట్వీట్ చేస్తూ డిసెంబర్ 13 కొత్త రిలీజ్ తేదీని ప్రకటించారు.
మరి కొన్ని చిన్న సినిమాలు వెనక్కి
‘ఈషా’, ‘డ్రైవ్’ వంటి చిన్న సినిమాలు కూడా 12నుంచి వెనక్కి షిఫ్ట్ అయినట్లు సమాచారం. బాలకృష్ణ సినిమా భారీ బజ్ కారణంగా చిన్న, మధ్యస్థాయి చిత్రాలు ప్రత్యామ్నాయ తేదీల కోసం చూస్తున్నాయి.మరి భారీ అంచనాలు నడుమ వస్తున్న అఖండ 2 చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram