Akhanda 2 | ‘అఖండ 2’ రిలీజ్ విషయంలో ఇంత రచ్చ నడుస్తున్నాబాలయ్య మౌనం… కారణం ఏంటి?
Akhanda 2 | బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన పాన్-ఇండియా చిత్రం అఖండ 2. యాక్షన్–డివోషనల్ డ్రామాగా ‘అఖండ 2’ చిత్రం రూపొందగా, ప్రీమియర్ షోలు చివరి నిమిషంలో రద్దు అయ్యాయి.
Akhanda 2 | బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన పాన్-ఇండియా చిత్రం అఖండ 2. యాక్షన్–డివోషనల్ డ్రామాగా ‘అఖండ 2’ చిత్రం రూపొందగా, ప్రీమియర్ షోలు చివరి నిమిషంలో రద్దు అయ్యాయి. అలానే రిలీజ్ కూడా వాయిదా పడటంతో అభిమానుల్లో తీవ్ర ఆవేదన నెలకొంది. నిర్మాతలు ఇది టెక్నికల్ ఇష్యూ అని ప్రకటించినా… వాస్తవానికి పాత ఫైనాన్షియల్ లావాదేవీలు, లీగల్ ఇష్యూలే అసలు కారణమని పరిశ్రమలో చర్చ సాగుతోంది.
ఏరోస్–14 రీల్స్ మధ్య పాత వివాదమే ‘అఖండ 2’ రద్దుకు కారణం
మద్రాస్ హైకోర్టు ఈ చిత్రంపై తాత్కాలిక స్టే విధించడంతో రిలీజ్ వాయిదా పడింది. మహేశ్‌బాబు నటించిన ‘1 నేనొక్కడినే’, ‘ఆగడు’ డిజాస్టర్‌గా నిలవడంతో ఏరోస్ ఎంటర్టైన్మెంట్ భారీ నష్టాలు చవిచూసింది. ఆ రెండు సినిమాలకు సంబంధించిన సుమారు 27–28 కోట్ల బకాయిలు 14 రీల్స్ సంస్థ ఏరోస్‌కి చెల్లించాల్సి ఉంది. వడ్డీలు కూడా భారీగా పేరుకుపోవడంతో ఏరోస్ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే ‘అఖండ 2’ పై విడుదలకు కొద్దిగంటల ముందు హైకోర్టు స్టే విధించింది. నిర్మాతలు అయితే ఈ అంశంపై అధికారికంగా ఏమీ చెప్పలేదు.
బాలకృష్ణ ఎందుకు రంగంలోకి దిగలేదు?
ఫ్యాన్స్ నుంచి ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఇదే. ఇటీవల పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సమస్యల్లో ఉన్నప్పుడు జోక్యం చేసుకుని సినిమా సాఫీగా సాగేందుకు సహకరించిన సంగతి తెలిసిందే. మరి ‘అఖండ 2’ ఇష్యూలో బాలకృష్ణ స్పందించడం లేదేంటని అభిమానుల్లో డౌట్స్ మొదలయ్యాయి. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం బాలకృష్ణ మొదట సమస్యను చర్చించేందుకు ముందుకు వచ్చారట.
కానీ ఇది చాలా పెద్ద ఫైనాన్షియల్ వివాదం, పైగా కోర్టు వరకు వెళ్లిన కేసు కావడంతో ఆయన జోక్యం పనికిరాదని అర్థం చేసుకున్నారట. రిలీజ్‌కు దగ్గర్లో ఉన్నప్పుడే ఇలాంటి ఇష్యూను ఎందుకు పరిష్కరించలేదని బాలయ్య మేకర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా టాక్ ఉంది. ఈ కారణాల వల్లే బాలకృష్ణ పబ్లిక్‌గా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఫ్యాన్స్ విశ్వాసం: ‘అఖండ 2’పై ప్రభావం ఉండదు
రిలీజ్ వాయిదా అభిమానుల్లో ఆగ్రహం రేపినా… సినిమా మీద మాత్రం నమ్మకం తగ్గలేదు. ‘అఖండ’ ఫ్రాంచైజీకి దేశవ్యాప్తంగా పెద్ద క్రేజ్ ఉంది. బోయపాటి–బాలయ్య కాంబో అంటే మాస్ ఆడియన్స్‌కి పండగ. టీజర్లు, ట్రైలర్, సాంగ్స్ కూడా అంచనాలు ఆకాశానికి చేరేలా చేశాయి. సమస్యలు క్లియర్ అవగానే సినిమాకు కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram