Gunasekhar Euphoria teaser| గుణశేఖర్ కొత్త చిత్రం ‘యుఫోరియా’ టీజర్ రిలీజ్

ప్రతిభావంతులైన దర్శకులలో ఒకడిగా గుర్తింపు ఉన్నప్పటికి బాక్సాఫీస్ సునామీ సృష్టించే చిత్రాలను రూపొందించడంలో వెనుకబడిపోతున్న గుణశేఖర్ సుదీర్ఘ విరామం అనంతరం యుఫోరియా’అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ‘యుఫోరియా’ చిత్రానికి సంబంధించిన టీజర్ ను సోమవారం విడుదల చేశారు.

Gunasekhar Euphoria teaser| గుణశేఖర్ కొత్త చిత్రం ‘యుఫోరియా’ టీజర్ రిలీజ్

విధాత, హైదరాబాద్ : ప్రతిభావంతులైన దర్శకులలో ఒకడిగా గుర్తింపు ఉన్నప్పటికి బాక్సాఫీస్ సునామీ సృష్టించే చిత్రాలను రూపొందించడంలో వెనుకబడిపోతున్న గుణశేఖర్ (Gunasekhar)సుదీర్ఘ విరామం అనంతరం యుఫోరియా’(Euphoria)అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ‘యుఫోరియా’ చిత్రానికి సంబంధించిన టీజర్ (teaser)ను సోమవారం విడుదల చేశారు. గుణశేఖర్‌ ఈ చిత్రాన్ని కొత్త కాన్సెప్ట్‌తో నిర్మిస్తున్నారని సమాచారం. టీజర్ చూస్తే మాత్రం మాదకద్రవ్యాల వల్ల యువత ఎదుర్కొనే సమస్యల ఆధారంగా ‘యుఫోరియా’ తెరకెక్కినట్లుగా తెలుస్తుంది. భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘యుఫోరియా’ చిత్రానికి నీలిమా గుణశేఖర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న విడుదల కానుంది.

తన కెరీర్ లో 13సినిమాలు.. లాఠీ, సొగసు చూడతరమా, రామాయణం(బాలనటులతో), చూడాలని ఉంది, మనోహారం, మృగరాజు, ఒక్కడు, అర్జున్, సైనికుడు, వరుడు, నిప్పు, రుద్రమదేవి, శాకుంతలం చిత్రాలు రూపొందించిన గుణశేఖర్ విభిన్న జోనర్ లో సినిమాలు చేశాడు. వాటిలో భారీ విజయాలను, పెయిల్యూర్లను చవిచూశాడు. ఈ నేపథ్యంలో గుణశేఖర్ రూపొందిస్తున్న ‘యుఫోరియా’ చిత్రం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తి కరంగా మారింది.