Peddi | ‘పెద్ది’ రిలీజ్ డేట్‌పై కన్ఫ్యూజన్ … క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్, కానీ పోస్టర్‌తో మళ్లీ సందేహాలు
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మొదటగా ఈ సినిమాను మార్చి 27న విడుదల చేయాలని ప్లాన్ చేసిన మేకర్స్, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసి ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ చిత్రం మళ్లీ వాయిదా పడుతుందని, జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో అభిమానుల్లో కన్ఫ్యూజన్ నెలకొంది.
ఎక్కడో అనుమానం…
ఈ నేపథ్యంలో తాజాగా రామ్ చరణ్ స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు. ‘రాకాస’ సినిమా టీంను కలిసిన సందర్భంగా మాట్లాడుతూ, ‘పెద్ది’ విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని, ప్రకటించినట్లుగానే ఏప్రిల్ 30న థియేటర్లలోకి వస్తుందని వెల్లడించారు. దీంతో అభిమానులు కొంత ఊరట చెందారు.
అయితే, ఇదే సమయంలో హనుమాన్ జయంతి సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ మళ్లీ కొత్త సందేహాలకు తావిచ్చింది. సాధారణంగా ఇలాంటి పెద్ద సినిమాల పోస్టర్లలో రిలీజ్ డేట్‌ను స్పష్టంగా చూపిస్తారు. కానీ ఈ పోస్టర్‌లో విడుదల తేదీ ఎక్కడా లేకపోవడం గమనార్హం. దీంతో వాయిదా వార్తలకు మరోసారి బలం చేకూరింది.
షూటింగ్ ఇంకా పూర్తి కాలేదా..
ఒకవైపు హీరో స్వయంగా రిలీజ్ డేట్ మారదని చెబుతుండగా, మరోవైపు అధికారిక పోస్టర్‌లో తేదీ లేకపోవడం అభిమానులను గందరగోళానికి గురిచేస్తోంది. సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదా? లేక పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సోషల్ మీడియాలో నెటిజన్లు వివిధ కోణాల్లో స్పందిస్తూ, చిత్ర బృందం వెంటనే అధికారిక ప్రకటన చేసి ఈ అనుమానాలకు తెరదించాలని కోరుతున్నారు. ముఖ్యంగా ప్రమోషన్స్ వేగవంతం కావాల్సిన సమయంలో ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండటం సినిమా బజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అయితే ‘పెద్ది’ రిలీజ్ డేట్‌పై కొనసాగుతున్న ఈ గందరగోళానికి మేకర్స్ త్వరలోనే ఫుల్ క్లారిటీ ఇస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram