Dhurandhar 2 | బాత్‌రూమ్ సీన్‌తో సంచలనం.. మూడు రాత్రులు నిద్రపోలేదట
Dhurandhar 2 | ‘ధురంధర్ 2’ సినిమా కేవలం యాక్షన్‌తోనే కాదు, భావోద్వేగభరిత సన్నివేశాలతో కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. కథా గమనంలో ప్రతి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండగా, ఏ పాత్రను తీసేసినా కథ అసంపూర్తిగా అనిపించేలా దర్శకుడు రూపకల్పన చేశారు.
Dhurandhar 2 | ‘ధురంధర్ 2’ సినిమా కేవలం యాక్షన్‌తోనే కాదు, భావోద్వేగభరిత సన్నివేశాలతో కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. కథా గమనంలో ప్రతి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండగా, ఏ పాత్రను తీసేసినా కథ అసంపూర్తిగా అనిపించేలా దర్శకుడు రూపకల్పన చేశారు. ముఖ్యంగా చిన్న పాత్రల నుంచి ప్రధాన పాత్రల వరకు ప్రతి ఒక్కరు తమదైన ముద్ర వేసిన తీరు ప్రశంసలు అందుకుంటోంది.
ఈ చిత్రంలో అత్యంత చర్చనీయాంశంగా మారింది నటుడు ఉదయ్‌బీర్ సంధు మరియు రణవీర్ సింగ్ మధ్య వచ్చే బాత్‌రూమ్ సన్నివేశం. సినిమాలో ప్రతి సన్నివేశం ఒక ఎత్తు అయితే, ఈ సీన్ మాత్రం మరో స్థాయికి తీసుకెళ్లిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
మూడు రాత్రులు నిద్ర లేదు..
డ్రగ్ డీలర్ ‘పిండా’ పాత్రలో ఉదయ్‌బీర్ సంధు అద్భుతంగా నటించారు. ముఖ్యంగా రణవీర్ సింగ్‌తో జరిగే ఆ తీవ్ర సంభాషణలో ఆయన చూపించిన భావోద్వేగం, పాత్రలోని లోతు ప్రేక్షకులను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ సీన్ తనపై ఎంతటి మానసిక ప్రభావం చూపిందంటే, షూటింగ్ పూర్తయ్యాక వరుసగా మూడు రాత్రులు నిద్రపోలేకపోయానని ఉదయ్‌బీర్ స్వయంగా వెల్లడించారు. ఆ పాత్ర నుంచి బయటపడటానికి కూడా చాలా సమయం పట్టిందని ఆయన చెప్పారు.
ఈ సన్నివేశాన్ని దర్శకుడు ఆదిత్య ధర్ అత్యంత సహజంగా తెరకెక్కించారు. షూటింగ్ ముగిసిన వెంటనే ఉదయ్‌బీర్ దగ్గరకు వెళ్లి, “నువ్వు ఎంత గొప్ప పని చేశావో నీకు ఇప్పుడు అర్థం కాదు, సినిమా విడుదలయ్యాక తెలుస్తుంది” అంటూ ప్రశంసించారట. ఆయన చెప్పినట్లుగానే థియేటర్లలో ఈ సీన్ వచ్చినప్పుడు ప్రేక్షకులు పిన్‌డ్రాప్ సైలెన్స్‌తో ఆ ఎమోషన్‌ను ఆస్వాదిస్తున్నారు.
ఓవర్‌నైట్ స్టార్‌గా..
ఈ సినిమాలో ఉదయ్‌బీర్ పలికించిన “ఘర్ దీ యాద్ నహీ ఆయీ తుజే, జస్సీ?” అనే డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవైపు గూఢచారిగా రణవీర్ సింగ్ తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతుంటే, మరోవైపు స్నేహితుడిగా అడిగే ఈ ప్రశ్న ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తోంది.
ఈ ఒక్క సన్నివేశంతోనే ఉదయ్‌బీర్ సంధు ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయారు. ‘ధురంధర్ 2’ విజయానికి కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఇలాంటి భావోద్వేగ సన్నివేశాలు కూడా కీలక పాత్ర పోషించాయని చెప్పవచ్చు. ఒక నటుడు తన పాత్ర కోసం ఎంతటి మానసిక సంఘర్షణను అనుభవిస్తాడో ఈ సినిమాతో ఉదయ్‌బీర్ నిరూపించారు.
ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం, లాంగ్ రన్‌లో మరింత భారీ వసూళ్లు సాధించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొంతమంది విశ్లేషకులు అయితే, ఈ సినిమా దంగల్ రికార్డులను కూడా తిరగరాయవచ్చని భావిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram