Mega 158 | ‘మెగా 158’కి శ్రీకారం చుట్టే సమయం దగ్గరపడిందా.. చిరంజీవి–బాబీ కాంబోపై భారీ అంచనాలు
Mega 158 | టాలీవుడ్లో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మెగా 158’ ఇప్పుడు అధికారికంగా ప్రారంభానికి సిద్ధమవుతోంది. చిరంజీవి మరియు దర్శకుడు బాబీ కొల్లి మరోసారి చేతులు కలపడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.
Mega 158 | టాలీవుడ్లో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మెగా 158’ ఇప్పుడు అధికారికంగా ప్రారంభానికి సిద్ధమవుతోంది. చిరంజీవి మరియు దర్శకుడు బాబీ కొల్లి మరోసారి చేతులు కలపడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో, ‘మెగా 158’పై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా, ఈసారి మెగాస్టార్ను బాబీ ఏ రేంజ్ మాస్ అవతారంలో చూపిస్తారన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
టైమ్ ఫిక్స్..
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11, 2026న వైభవంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు. అనంతరం ఏప్రిల్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి బాడీ లాంగ్వేజ్కు తగ్గట్టుగా దర్శకుడు బాబీ పవర్ఫుల్ కథను సిద్ధం చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ భారీ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమాలో టెక్నికల్ టీమ్ కూడా స్ట్రాంగ్గా ఉంది. సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిమిష్ రవి నిర్వహిస్తుండగా, సంగీతాన్ని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ అందిస్తున్నారు.
మాస్ ఎంటర్టైనర్ మూవీగా..
ఇంకా ఈ సినిమాలో నటించనున్న హీరోయిన్, ఇతర కీలక పాత్రధారులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలో ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ ప్రకటనల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మొత్తం మీద, ‘మెగా 158’ మెగాస్టార్ కెరీర్లో మరో మాస్ ఎంటర్టైనర్గా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడంతో మరింత బజ్ పెరగడం ఖాయం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram