NTR | ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్.. బీస్ట్ లుక్‌తో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్
NTR | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ (వర్కింగ్ టైటిల్)లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
NTR | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ (వర్కింగ్ టైటిల్)లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన శరీరాన్ని పూర్తిగా మార్చుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల షూటింగ్ సమయంలో ఆయన చాలా సన్నగా కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “ఎన్టీఆర్ ఇంత సన్నగా మారిపోయాడా?” అనే చర్చలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బీస్ట్ మోడ్‌లో..
అయితే ఆ సందేహాలకు చెక్ పెడుతూ తాజాగా ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఫోటో అభిమానులను షాక్‌కు గురి చేసింది. కండలు తిరిగిన బాడీతో, పవర్‌ఫుల్ బీస్ట్ మోడ్‌లో కనిపించిన ఆయన లుక్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. “ఇది పెంచుకున్నది.. కొనుక్కున్నది కాదు” అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోను షేర్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక ఫిట్‌నెస్ కోచ్ కుమార్ మన్నవ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కఠినమైన వర్కౌట్స్, క్రమశిక్షణతో కూడిన డైట్ ప్లాన్ ద్వారా ఎన్టీఆర్ ఈ ఫిజిక్‌ను సాధించినట్లు సమాచారం. ఈ ఫోటోను ‘డ్రాగన్’ సినిమాకు ట్యాగ్ చేయడం ద్వారా ఈ మార్పు పూర్తిగా ఆ సినిమా కోసమేనని ఆయన స్పష్టం చేశారు.
సిక్స్ ప్యాక్ బాడీతో..
ఇక ఈ లుక్‌ను చూసిన అభిమానులు ‘డ్రాగన్’లో ఎన్టీఆర్ మరింత పవర్‌ఫుల్‌గా కనిపించబోతున్నాడని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సిక్స్ ప్యాక్ బాడీతో మాస్ యాక్షన్ సన్నివేశాల్లో ఆయన అదరగొట్టడం ఖాయమని భావిస్తున్నారు.
ఒకప్పుడు లుక్‌పై వచ్చిన విమర్శలకు కఠిన శ్రమతో సమాధానం ఇచ్చిన ఎన్టీఆర్, ఇప్పుడు తన ఫిట్‌నెస్‌తో మరోసారి ఇండస్ట్రీని షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. మొత్తానికి ‘డ్రాగన్’ కోసం ఆయన చేసిన ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram