Prakash Raj | ‘అవి బాధ్యతాయుత‌మైన‌ ప్రశంసలేనా?’.. సౌత్ స్టార్లపై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

Prakash Raj | విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. తాజాగా విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘ధురంధర్ ది రివెంజ్’ పై దక్షిణాది స్టార్ హీరోలు కురిపించిన ప్రశంసలపై ఆయన పరోక్షంగా అనుమానాలు వ్యక్తం చేశారు.వివరాల్లోకి వెళితే, రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి స్పందనను సొంతం చేసుకుంది.

  • By: Sandeep |    movies |    Published on : Mar 20, 2026 4:21 PM IST
Prakash Raj  | ‘అవి బాధ్యతాయుత‌మైన‌ ప్రశంసలేనా?’.. సౌత్ స్టార్లపై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

Prakash Raj | విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. తాజాగా విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘ధురంధర్ ది రివెంజ్’ పై దక్షిణాది స్టార్ హీరోలు కురిపించిన ప్రశంసలపై ఆయన పరోక్షంగా అనుమానాలు వ్యక్తం చేశారు.వివరాల్లోకి వెళితే, రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి స్పందనను సొంతం చేసుకుంది. సినిమా విడుదల అనంతరం టాలీవుడ్‌కు చెందిన అగ్ర హీరోలు వరుసగా సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

అల్లు అర్జున్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు ‘ధురంధర్ 2’ సినిమాను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇదే విషయంపై ఓ నెటిజన్ ఆసక్తికర ప్రశ్న లేవనెత్తాడు. “నలుగురు పెద్ద సౌత్ స్టార్లు ఈ సినిమాను పొగిడారు. కానీ ఒక్క బాలీవుడ్ సెలబ్రిటీ అయినా స్పందించారా?” అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఈ పోస్ట్‌కు స్పందించిన ప్రకాశ్ రాజ్, “ఈ ‘బాధ్యతల’ సంకేతాలు దక్షిణాదికి కూడా పాకుతున్నాయి.. #జస్ట్ ఆస్కింగ్‌” అంటూ వ్యాఖ్యానించారు.

ప్రకాశ్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన వ్యాఖ్యల అర్థం ఏమిటి? నిజంగా సౌత్ స్టార్లు ఒత్తిడితోనే ప్రశంసలు కురిపించారా? అనే చర్చ మొదలైంది. ఇక ఈ వ్యాఖ్యలపై ఇప్పటివరకు ఎవరూ స్పందించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రకాశ్ రాజ్ అభిప్రాయానికి మద్దతు తెలుపుతుండగా, మరికొందరు మాత్రం స్టార్ హీరోలు మంచి సినిమాను ప్రశంసించడం సహజమేనని అంటున్నారు. మొత్తంగా, ‘ధురంధర్’ సినిమా చుట్టూ ఇప్పుడు కొత్త వివాదం మొదలైందనే చెప్పాలి.