Ram Charan | ‘పెద్ది’ తర్వాత క్విక్ ప్రాజెక్ట్ ప్లాన్‌లో రామ్ చరణ్.. సీక్రెట్ డైరెక్టర్ ఎవరు?
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరీర్ ప్లానింగ్‌తో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. జూన్ 4న విడుదలకు సిద్ధమవుతున్న ‘పెద్ది’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, ఈ చిత్రం తర్వాత ఆయన చేసే ప్రాజెక్టులపై కూడా ఇండస్ట్రీలో చర్చలు జోరుగా సాగుతున్నాయి.
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరీర్ ప్లానింగ్‌తో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. జూన్ 4న విడుదలకు సిద్ధమవుతున్న ‘పెద్ది’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, ఈ చిత్రం తర్వాత ఆయన చేసే ప్రాజెక్టులపై కూడా ఇండస్ట్రీలో చర్చలు జోరుగా సాగుతున్నాయి.
ఇప్పటికే దర్శకుడు సుకుమార్‌తో చేయబోయే RC17 ప్రాజెక్ట్ గురించి వార్తలు వినిపిస్తుండగా, ఆ సినిమా ప్రారంభానికి ముందే చరణ్ ఒక క్విక్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మించనున్నారని సమాచారం.
సీక్రెట్ డైరెక్టర్..
ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆసక్తికర అంశం డైరెక్టర్ ఎంపిక. చరణ్ ఇప్పటికే ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించారని టాక్ వినిపిస్తుండగా, దర్శకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు అన్నది సస్పెన్స్‌గా మారింది. సితార సంస్థలో ఇటీవల కాలంలో కొత్త దర్శకులతో పాటు అనుభవజ్ఞులైన దర్శకులు కూడా పనిచేసిన విషయం తెలిసిందే. దీంతో చరణ్ లాంటి స్టార్ హీరోకు సరిపోయే దర్శకుడిని ఎంచుకోవడం కీలకంగా మారింది.
ఇక ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పేరు కూడా బలంగా వినిపిస్తోంది. గతంలో చరణ్-గౌతమ్ కాంబినేషన్‌లో ఒక సినిమా ప్లాన్ అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్‌ను సెట్ చేయాలని నాగవంశీ ఆలోచిస్తున్నారనే చర్చ జరుగుతోంది.
పక్కా ప్లానింగ్‌తో..
గౌతమ్ దర్శకత్వంలో నాగవంశీ నిర్మించిన ‘కింగ్‌డమ్’ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా, ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్‌పై నిర్మాతకు మంచి నమ్మకం ఉందని ఇండస్ట్రీ టాక్. ఒకవేళ చరణ్ ఈ ప్రాజెక్ట్‌కు గౌతమ్‌ను ఫైనల్ చేస్తే, అది ఖచ్చితంగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కూడిన క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందని భావిస్తున్నారు.
ఇక నాగవంశీ ప్లానింగ్ ప్రకారం ఈ సినిమా చాలా తక్కువ సమయంలో పూర్తయ్యేలా రూపొందించనున్నారని తెలుస్తోంది. ఎందుకంటే జూన్ నెల నుంచే సుకుమార్ దర్శకత్వంలో RC17 ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కానున్నాయి. ఆ గ్యాప్‌లోనే ఈ క్విక్ ప్రాజెక్ట్‌ను కంప్లీట్ చేయాలని చరణ్ భావిస్తున్నారని సమాచారం.
మొత్తానికి, ‘పెద్ది’ విడుదల తర్వాత రామ్ చరణ్ చేయబోయే ఈ క్విక్ ప్రాజెక్ట్‌పై రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. దర్శకుడు ఎవరు అన్నది త్వరలో అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. 2026 సంవత్సరం చరణ్ కెరీర్‌లో అత్యంత కీలకంగా మారబోతోందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram