స్కాలర్‌షిప్స్ పంపిణీలో రష్మిక ఇన్స్పైరింగ్ స్పీచ్

హీరో విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు ​‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరంలో అచ్చంపేట డివిజన్‌లోని విద్యార్థుల ‘మెరిట్ స్కాలర్‌షిప్ అవార్డీస్’ ను పంపిణీ చేశారు. స్కాలర్‌షిప్స్ పంపిణీలో రష్మిక ఇన్స్పైరింగ్ స్పీచ్ తో అందరిని ఆకట్టుకున్నారు.

విధాత : హీరో విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు ​‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరంలో అచ్చంపేట డివిజన్‌లోని విద్యార్థుల ‘మెరిట్ స్కాలర్‌షిప్ అవార్డీస్’ ను పంపిణీ చేశారు. స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా తుమ్మన్‌పేటలో ఇంటిలోకి గృహప్రవేశం సమయంలో ప్రతిభ గల విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తానని విజయ్ దేవరకొండ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సతీమణి రష్మికతో కలిసి విజయ్ స్కాలర్ షిప్ లను విద్యార్థులకు అందించారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మండలానికి చెందిన 180 మంది విద్యార్థులకు ఆర్థికసాయం చేశారు. ఇందులో 45 ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులు స్కాలర్ షిప్ లు అందుకున్నారు. 9, 10వ తరగతుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి ఈ ఉపకారవేతనాలు అందజేశారు.

ఈ సందర్బంగా రష్మిక చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. “ఈరోజు నేను రష్మిక మందన్న దేవరకొండలా మాట్లాడుతున్నానంటూ ఆమె తెలుగులో తన ఉపన్యాసం ఇచ్చారు. లైఫ్‌లో కొన్నిసార్లు విన్ అవుతాం, కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం.. కానీ ప్రతిసారి నేర్చుకుంటాం. పేరెంట్స్, టీచర్స్ నుంచి నేర్చుకొని గొప్పగా ఎదగండి అని విద్యార్థులకు సూచించారు. స్కాలర్‌షిప్స్ పంపిణీలో రష్మిక ఇన్స్పైరింగ్ స్పీచ్ విన్న వారంతా ఆమెను పొగడ్తలతో అభినందించారు. ఇచ్చిన మాట మేరకు విజయ్ దంపతులు విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందించినందుకు వారిని గ్రామస్థులు, అభిమానులు ప్రశంసించారు.

 

Latest News