ల్యాప్‌టాప్ కొంటున్నారా..? ఈ విషయాలను తెలుసుకోండి..!
ఒకప్పుడు డెస్క్‌టాప్ కంప్యూటర్లను కొనాలంటే ఆచి తూచి అడుగు వేసేవారు. ఎందుకంటే అవి చాలా ఖరీదైనవి కాబట్టి. ఇక ల్యాప్‌టాప్‌ల మాట చెప్పలేం. ఒకప్పుడు అవి చుక్కలనంటే ధరల్లో ఉండేవి. కానీ టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు అన్నీ తక్కువ ధరకే లభిస్తున్నాయి. ల్యాప్‌టాప్‌లు కూడా చాలా తక్కువ ధరకే మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో అయితే రాయితీలను పొందవచ్చు. దీంతో ల్యాప్‌టాప్‌ల ధర మరింత తగ్గుతుంది. అయితే ల్యాప్‌టాప్ కొనేముందు అసలు వాటిల్లో […]

ఒకప్పుడు డెస్క్‌టాప్ కంప్యూటర్లను కొనాలంటే ఆచి తూచి అడుగు వేసేవారు. ఎందుకంటే అవి చాలా ఖరీదైనవి కాబట్టి. ఇక ల్యాప్‌టాప్‌ల మాట చెప్పలేం. ఒకప్పుడు అవి చుక్కలనంటే ధరల్లో ఉండేవి. కానీ టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు అన్నీ తక్కువ ధరకే లభిస్తున్నాయి. ల్యాప్‌టాప్‌లు కూడా చాలా తక్కువ ధరకే మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో అయితే రాయితీలను పొందవచ్చు. దీంతో ల్యాప్‌టాప్‌ల ధర మరింత తగ్గుతుంది. అయితే ల్యాప్‌టాప్ కొనేముందు అసలు వాటిల్లో ఎలాంటి ఫీచర్లు చూడాలి ? ఏ ల్యాప్‌టాప్ అయితే బాగుంటుంది ? అంటే.. అందుకు కింద తెలిపిన టిప్స్ పనికొస్తాయి. అందుకు అనుగుణంగా మీకు నచ్చిన ల్యాప్‌టాప్‌ను మీరే ఎంపిక చేసుకోవచ్చు. మరి ల్యాప్‌టాప్ కొనే ముందు మీరు తెలుసుకోవాల్సిన ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. బడ్జెట్
ల్యాప్‌టాప్ కొనేవారు కచ్చితంగా బడ్జెట్ ను ముందు నిర్ణయించుకోవాలి. ఫలానా ధరలో మాత్రమే ల్యాప్‌టాప్ కొనాలని ముందుగానే అనుకోవాలి. దాంతో బడ్జెట్‌కు అనుగుణంగా ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు. బడ్జెట్ నిర్ణయించాకే దానికి అనుగుణంగా ల్యాప్‌టాప్ ఫీచర్లను ఎంపిక చేసుకోవాలి.
2. ప్రాసెసర్
డెస్క్‌టాప్ అయినా ల్యాప్‌టాప్ పీసీ అయినా.. ఏదైనా సరే.. పీసీ ఎంపిక చేసేటప్పుడు ముందుగా ప్రాసెసర్‌పై ఓ లుక్కేయాలి. ఎందుకంటే పీసీ వేగంగా పనిచేయాలంటే ప్రాసెసర్ చాలా వేగవంతమైంది అయి ఉండాలి. ప్రస్తుతం మార్కెట్‌లో మనకు ఇంటెల్, ఏఎండీ రెండు కంపెనీలకు చెందిన ప్రాసెసర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంటెల్ ప్రాసెసర్లు బాగా వేగంగా పనిచేస్తాయి కానీ ధర ఎక్కువ. డబ్బులు వెచ్చిస్తామనుకుంటే ఇంటెల్ ప్రాసెసర్ ఉన్న ల్యాప్‌టాప్‌ను ఎంపిక చేసుకోవచ్చు. లేదా బడ్జెట్ మీరుతుంది అనుకుంటే ఏఎండీ ప్రాసెసర్ ఉన్న ల్యాప్‌టాప్‌ను ఎంపిక చేసుకోవాలి. ఇంటెల్‌లో మనకు కోర్ ఐ3, ఐ5, ఐ7, ఐ9 ప్రాసెసర్లు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి. నంబర్ పెరిగే కొద్దీ ప్రాసెసర్ వేగంగా పనిచేస్తుందని అర్థం చేసుకోవాలి.