Meera Jasmine | ఈ మల్లెపువ్వు మళ్లీ ఎందుకు నటిస్తుందో తెలుసా?
Meera Jasmine | ‘గుడుంబా శంకర్’ సినిమా గుర్తుంది కదా… ‘చిట్టినడుమునే చూస్తున్నా.. చిత్రహింసలో చస్తున్నా’ అంటూ సాగే పాటలో నడుముని ముఫ్పై వంకర్లు తిప్పుతుంది. ఆ సినిమాతో పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసి, కుర్రకారుకి కితకితలు పెట్టేసింది గ్లామరస్ బ్యూటీ మీరా జాస్మిన్. తన అందంతో పాటు, అభినయంతో ఎన్నో మంచి క్యారెక్టర్స్ చేసింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇలా చాలా భాషల్లో నటించింది. తెలుగులో పవన్ కళ్యాణ్‌తో ‘గుడుంబా శంకర్’, […]

Meera Jasmine |
‘గుడుంబా శంకర్’ సినిమా గుర్తుంది కదా… ‘చిట్టినడుమునే చూస్తున్నా.. చిత్రహింసలో చస్తున్నా’ అంటూ సాగే పాటలో నడుముని ముఫ్పై వంకర్లు తిప్పుతుంది. ఆ సినిమాతో పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసి, కుర్రకారుకి కితకితలు పెట్టేసింది గ్లామరస్ బ్యూటీ మీరా జాస్మిన్. తన అందంతో పాటు, అభినయంతో ఎన్నో మంచి క్యారెక్టర్స్ చేసింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇలా చాలా భాషల్లో నటించింది.
తెలుగులో పవన్ కళ్యాణ్‌తో ‘గుడుంబా శంకర్’, రవితేజతో ‘భద్ర’, రాజశేఖర్‌తో ‘గోరింటాకు’ సినిమాలు మీరాకు మంచి గుర్తింపును తెచ్చాయి. తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా మంచి తారగా గుర్తింపుతెచ్చుకుంది. 2014లో వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసిన మీరా, ప్రస్తుతం మళ్ళీ తన 40 ఏళ్ళ వయసులో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.
అయితే ఈ సెకండ్ ఇన్నింగ్స్ అందరిలా కాకుండా కాస్త ఘాటుగా ఉండాలనుకుందేమో తెలీదు కానీ.. అప్పటి వరకూ సాంప్రదాయంగా కనిపించి చేసిన సినిమాలకు పూర్తి రివర్స్‌లో మీరా సోషల్ మీడియాలో గ్లామర్ షో మొదలు పెట్టింది. నలభైల్లోనూ తన అందాలను పరుస్తూ, కుర్రకారుకి మతులు పోగొడుతుంది. హట్ లుక్స్‌తో సోషల్ మీడియాలో ఫోటోలకు ఫోజులిస్తూ కనిపిస్తుంది.
మరి మొదట్లోనే తన సినీ కెరియర్ని ఇంత గ్లామర్‌గా ఎందుకు స్టార్ట్ చేయలేదో.. ఈ వయసులో ఎందుకు పరువాలను ఒలకబోస్తుందో అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇన్ని తంటాలూ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీకేనా? అనుకుంటున్నారు ఫ్యాన్స్. తాజాగా ‘విమానం’ సినిమాలో ఎయిర్ హోస్టస్‌గా కనిపించింది మీరా జాస్మిన్.
అయితే తను సినిమాలకు ఎందుకు ఇంత గ్యాప్ ఇవ్వాల్సి వచ్చిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిందీ మల్లెపువ్వు. ‘‘ఎంతో కాలం హీరోయిన్గా నటించాను. దానికి చాలా గర్వంగా ఉంది. నా నటనను ఇంకా మెరుగు పరుచుకునేందుకే కాస్త గ్యాప్ ఇచ్చాను’’ అని తెలిపింది.
ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రావడం సంతోషంగా ఉందని, ఈ ప్రయాణం కొత్తగా ఉందని చెప్పింది. ఇలా కాస్త ఫేడవుట్ అయిన తారలంతా గ్లామర్ ప్రదర్శిస్తూ సినిమాల్లోకి వచ్చిపడితే, కొత్తగా వచ్చే హీరోయిన్స్ వాళ్ళతో పోటీ పడడానికి ఇంకెన్ని పాట్లు పాడాలో అనుకుంటున్నారు సినీ జనాలు.