Akira Nandan: కొడుకుని రేణు దేశాయ్.. ఎలా పెంచుతుందో చూశారా?
Akira Nandan అకీరా నందన్ తెలుసా? అదేనండీ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్‌ల కొడుకు. ఈ ఇద్దరూ విడిపోయి చాలాకాలమే అవుతున్నా ఏదో విషయంలో రేణు దేశాయ్ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తనని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారనో, లేదా తన వ్యక్తిగత విషయాలపై రచ్చ చేస్తున్నారనో, నా విషయాలు మీకెందుకు అంటూ ఇంటర్వ్యూలు ఇస్తూనో.. రేణు ఎప్పుడూ వార్తల్లో, సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. కొద్ది కాలం క్రితం అకీరా నందన్ నా కుమారుడు […]

Akira Nandan
అకీరా నందన్ తెలుసా? అదేనండీ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్‌ల కొడుకు. ఈ ఇద్దరూ విడిపోయి చాలాకాలమే అవుతున్నా ఏదో విషయంలో రేణు దేశాయ్ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తనని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారనో, లేదా తన వ్యక్తిగత విషయాలపై రచ్చ చేస్తున్నారనో, నా విషయాలు మీకెందుకు అంటూ ఇంటర్వ్యూలు ఇస్తూనో.. రేణు ఎప్పుడూ వార్తల్లో, సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది.
కొద్ది కాలం క్రితం అకీరా నందన్ నా కుమారుడు మాత్రమే పవన్ కొడుకు కాదంటూ కాస్త ఘాటుగానే ఫైర్ అయింది రేణు. అయితే తను చేసిన సినిమాల కంటే పవన్ భార్యగానే రేణు ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది.
ఆ మధ్య మళ్ళీ పెళ్ళని వార్తలు వినిపించిన తర్వాత, అవి ఆగిపోయిన తర్వాత ఇలా ప్రతి విషయమూ ఆమెపై విశేషంగానే ట్రోల్ అవుతూ వస్తుంది. పవన్‌తో విడిపోయాక రేణూ పిల్లలతో దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
తన పిల్లలకి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. సమయానికి తగ్గట్టుగా ట్వీట్లు చేస్తూ తన పిల్లల విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతూ.. వచ్చిన స్పందనలకు రేణూ దేశాయ్ తన రీతిలో రియాక్ట్ అవుతూ ఉంటుంది.
తాజాగా కొడుకు అకీరా నందన్‌కు సంబంధించిన ఓ వీడియోను రేణు పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా వైరల్ అవుతోంది. అకీరా నందన్ వర్కౌట్స్ చేస్తున్న వీడియోను రేణు దేశాయ్ తన ట్విట్టర్‌లో షేర్ చేసింది.
ఇందులో ఏముంది స్పెషల్ అని అనుకుంటున్నారా? జిమ్ నిర్వాహకులు వర్కౌట్ చేయించే సమయంలో ఇంగ్లీష్ పాటలు కాకుండా మాతృభాషలో పాటలను వినిపిస్తే మనసుకు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది కదా అంటూ కామెంట్ చేసింది.
నేను వర్కౌట్ చేసేప్పుడు కూడా తెలుగు పాటలను పెట్టమని అడిగేదాన్ని.. అలా వినడం వల్ల భాష మీద పట్టుతో పాటు, ఆ సినిమా మీద అభిమానం కూడా పెరుగుతుందని తన ట్వీట్‌లో సలహా ఇచ్చింది. ఈ వీడియోలో తెలుగు పాట వింటూ అకీరా నందన్ వర్కవుట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు, రేణు దేశాయ్ సలహాకు నెటిజన్ల నుంచి మంచి స్పందనే వస్తోంది.
View this post on Instagram