RRR మరో ఘనత.. ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో ‘నాటు నాటు’కు చోటు..!
RRR Movie | రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. 95వ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్‌లో షార్ట్‌లిస్ట్ జాబితాలో చోటు దక్కింది. పది విభాగాల్లో ఎంపిక చేసిన సినిమాల జాబితాను గురువారం అకాడమీ ప్రకటించగా.. ఇందులో ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్‌లోని ‘నాటు నాటు’ పాటకు చోటు కల్పించింది. అలాగే ‘ది లాస్ట్ ఫిల్మ్ షో’ (చెల్లో షో) బెస్ట్ ఇంటర్‌నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో చోటు దక్కింది. ఈ […]

RRR Movie | రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. 95వ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్‌లో షార్ట్‌లిస్ట్ జాబితాలో చోటు దక్కింది. పది విభాగాల్లో ఎంపిక చేసిన సినిమాల జాబితాను గురువారం అకాడమీ ప్రకటించగా.. ఇందులో ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్‌లోని ‘నాటు నాటు’ పాటకు చోటు కల్పించింది.
అలాగే ‘ది లాస్ట్ ఫిల్మ్ షో’ (చెల్లో షో) బెస్ట్ ఇంటర్‌నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో చోటు దక్కింది. ఈ రెండు చిత్రాలు మినహా మరే భారతీయ చిత్రాలు షార్ట్ లిస్ట్‌లో అవకాశం దక్కలేదు. ఆస్కార్ అవార్డుకు పోటీ పడుతున్న మొత్తం 81 ట్యూన్స్ నుంచి 15 పాటలను షార్ట్ లిస్ట్ చేయగా.. నాటు నాటు సాంగ్‌తో పాటు అవతార్-2లోని నథింగ్ ఈ లాస్ట్, బ్లాక్ పాంథర్‌లోని లిఫ్ట్ మీ అప్, టాప్ గన్ సినిమాలోని హోల్డ్ మై హాండ్ వంటి పాటలు ఉన్నాయి.
మొత్తం 15 సినిమాల్లో.. ఐదింటిని జనవరిలో ఆస్కార్ అవార్డుకు నామినేట్ చేయనున్నారు. ఐదు చిత్రాలు మాత్రమే ఆస్కార్‌కు పోటీ పడుతాయి. మార్చి 12న హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో ఆస్కార్ విజేతలను ప్రకటిస్తారు.