రావి నారాయణ రెడ్డి ప్రజలు గర్వించదగ్గ నాయకుడు: సీపీఐ రామకృష్ణ

ప్రజలు గర్వించదగ్గ నాయకుడు రావి నారాయణ రెడ్డి అని ఏపీ సీసీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట సేనాని రావినారాయణరెడ్డి 34 వర్ధంతి సందర్భంగా ఆదివారం మగ్దూం భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

  • By: Subbu    news    Sep 07, 2025 4:34 PM IST
రావి నారాయణ రెడ్డి ప్రజలు గర్వించదగ్గ నాయకుడు: సీపీఐ రామకృష్ణ

హైదరాబాద్, సెప్టెంబర్7(విధాత): ప్రజలు గర్వించదగ్గ నాయకుడు రావి నారాయణ రెడ్డి అని ఏపీ సీసీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట సేనాని రావినారాయణరెడ్డి 34 వర్ధంతి సందర్భంగా ఆదివారం మగ్దూం భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో గాంధీ చేస్తున్న ఉద్యమానికి ప్రభావితుడైన రావి నారాయణరెడ్డి కాకినాడలో జరిగిన సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారన్నారు.

తన రాజకీయ ప్రస్తావాన్ని ప్రారంభించిన రావినారాయణ నిజాం రాచరికానికి వ్యతిరేకంగా భూస్వాముల పీడనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఆంధ్ర మహాసభలో చేరారని వెల్లడించారు. ఆంధ్ర మహాసభకు రెండుసార్లు అధ్యక్షునిగా ఎన్నికైన రావి నారాయణ రెడ్డి దొరల భూస్వాముల ఎదిరించాలంటే సాయిధ పోరాటమే పరిష్కారమని మగ్దూం, బద్దం ఎల్లారెడ్డిలతో కలిసి సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని, వేలాది గ్రామాలను విముక్తి చేసి లక్షలాది ఎకరాల భూములను పేద ప్రజలకు పంచారన్నారు.

గ్రామాలలో కొనసాగుతున్న భూస్వామ్య కౌర్యానికి, నిజాం ప్రైవేట్ సైన్యంగా కొనసాగుతున్న రజాకారుల ఆగడాలను ఎదిరించి ప్రజా పోరాటాలను ఉదృతం చేయడంలో క్రియాశీలకమైన పాత్ర రావినారాయణరెడ్డి పోషించారని వెల్లడించారు.స్వయంగా తనకు వారసత్వంగా వచ్చిన వందలాది ఎకరాల భూమిని పేదలకు పంచి భూదాన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారని, అనంతరం ఆచార్య వినోబాభావే నాయకత్వంలో భూదాన ఉద్యమం ఉధృత రూపం దాల్చిందన్నారు. దేశంలో తొలిసారిగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నెహ్రూ కంటే అత్యధిక ఓట్లు సంపాదించి పార్లమెంటు లోకి తొలి అడుగు వేసిన ఘనత రావి నారాయణరెడ్డికి దక్కిందన్నారు.