ట్రోల్స్‌పై శ్రీ లీల షాకింగ్ రియాక్షన్

విధాత‌: మాస్ మహారాజా రవితేజ హీరోగా కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించడంలో తనదైన శైలి కలిగిన త్రినాథ‌ రావు నక్కిన తీస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ధమాకా. ఇందులో రాఘవేంద్ర రావు ద్వారా తెలుగులోకి పరిచయమైన శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందడి చిత్రం ద్వారా శ్రీ లీల హీరోయిన్‌గా పరిచయమైంది. తాజాగా ధమాకా మూవీ విడుదల సందర్భంగా హీరోయిన్ శ్రీ లీల మీడియాతో మాట్లాడుతూ.. త్రినాథ‌ రావు నక్కిన […]

ట్రోల్స్‌పై శ్రీ లీల షాకింగ్ రియాక్షన్

విధాత‌: మాస్ మహారాజా రవితేజ హీరోగా కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించడంలో తనదైన శైలి కలిగిన త్రినాథ‌ రావు నక్కిన తీస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ధమాకా. ఇందులో రాఘవేంద్ర రావు ద్వారా తెలుగులోకి పరిచయమైన శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తోంది.

శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందడి చిత్రం ద్వారా శ్రీ లీల హీరోయిన్‌గా పరిచయమైంది. తాజాగా ధమాకా మూవీ విడుదల సందర్భంగా హీరోయిన్ శ్రీ లీల మీడియాతో మాట్లాడుతూ.. త్రినాథ‌ రావు నక్కిన దర్శకత్వం వహించిన కిందటి చిత్రం హలో గురు ప్రేమకోసమే చిత్రంలో నన్ను నటించమని కోరారు. అప్పుడు రచయిత ప్రసన్న కూడా నాకు పరిచయం అయ్యాడు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు.

పెళ్లిసందడి విడుదల కాకముందే ధమాకా కథ చెప్పారు. ఈ చిత్రం మంచి ఎంటర్టైనర్ మాత్రమే కాదు మరింత హిలేరియస్‌గా ఉంటుంది. నాకు ఎంటర్టైన్మెంట్ చిత్రాల అంటే చాలా ఇష్టం. ఇక నా కెరీర్లో అతి తక్కువ సమయంలోనే మాస్ మహారాజా రవితేజ సరసన నటించే అవకాశం లభించింది.

కెరీర్ ప్రారంభంలోనే రాఘవేంద్ర రావు గారితో, రవితేజ గారితో పని చేయడం నా అదృష్టంగా చెప్పాలి. ఇందులో నా పాత్ర పేరు ప్రణవి. తర్వాత నందమూరి బాలకృష్ణ గారితో అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా షూటింగ్ ఇటీవలే మొదలయింది. అలాగే బోయపాటి శ్రీనివాస్ ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్‌లో మరో మూవీలో నటిస్తున్నాను.

వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న ఓ చిత్రంలో ఆయనకు జోడీగా నటిస్తున్నాను.. ఈ సినిమా కూడా స్టార్ట్ అయింది. అలాగే వారాహి మూవీ బ్యానర్లో ఓ చిత్రం, నితిన్‌తో మరో చిత్రం చేయాల్సి ఉంది అని చెప్పుకొచ్చింది.

మొత్తానికి ఈ ఏడాది టాలీవుడ్‌కు పరిచయమైన ఈ కొత్త హీరోయిన్ అందరి దృష్టి బాగా ఆకర్షిస్తుందనే చెప్పాలి. పెళ్లి సందడిలో ఆమె తన అందం నటన, డాన్స్‌తో కుర్రకారులో సెగలు పుట్టించేసింది. ఇప్పుడు ఆమెతో సినిమాలు చేయడానికి స్టార్ హీరో నుండి సీనియర్ హీరోల వరకు క్యూ కడుతున్నారు.

ఈమె జోరు చూస్తుంటే రాబోయే రోజుల్లో తెలుగు చలన చిత్ర పరిశ్రమను ఏలడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. డాన్సుల విషయానికి వస్తే ఈమె స్పీడ్‌కి అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి హీరోలు కూడా సరిపోరని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

సినిమాలే కాదు.. ఈ అమ్మడిపై వివాదాలు కూడా అనేకం వస్తున్నాయి. ఈ మధ్య ఎవరి కూతురనే విషయంలో పెద్ద వివాదమే జరిగింది. మళ్లీ శ్రీ లీలపై మరోసారి ట్రోల్స్ మొదలయ్యాయి. రవితేజ వయసు దాదాపు 53 కానీ శ్రీ లీలకి మాత్రం 21 అంటే ఇద్దరి మధ్య దాదాపు 32 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.

అంత గ్యాప్ పెట్టుకొని రవితేజతో రొమాంటిక్ సీన్స్ చేయడం ఏమిటి అంటూ.. జరుగుతున్న ట్రోల్స్‌పై శ్రీ లీల స్పందిస్తూ.. గతంలో శ్రీదేవి లాంటి హీరోయిన్స్ కూడా ఇలాగే చేశారు. ఎన్టీఆర్‌కి కూతురుగా నటించిన శ్రీదేవి.. ఆ తరువాత అనేక చిత్రాలలో హీరోయిన్‌గా నటించింది.

ఇలా చాలా మంది హీరోయిన్ల విషయంలో జరిగింది.. అప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కానీ నేను చేస్తే మాత్రం తప్పై పోయింది అంటున్నారు. అంటే వాళ్లు అలా చేసినా పర్వాలేదు కానీ.. నేను చేస్తే తప్పయిపోయిందా అంటూ గట్టిగానే సమాధానమిచ్చి గడుసరే అని నిరూపించుకుంది.