మెగాభిమానిగా మాటిస్తున్నా.. మాములుగా ఉండదు: బాబీ

విధాత‌: టాలీవుడ్‌లో ఉన్న యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ల‌లో బాబి అలియాస్ కె.ర‌వీంద్ర పేరును కూడా చెప్పుకోవాలి. మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టించ‌గా ఈయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ‘ప‌వ‌ర్’ చిత్రం ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆక‌ట్టుకుంది. ఆ వెంట‌నే సామాన్యంగా ఎవ్వ‌రికో గాని ల‌భించ‌ని అరుదైన అవ‌కాశం ఆయ‌న‌కు వ‌చ్చింది. అది ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన ‘స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్’ డైరెక్ట్ చేసే అవ‌కాశం. కానీ ఈ చిత్రం డిజాస్ట‌ర్ అయింది. ప‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో […]

మెగాభిమానిగా మాటిస్తున్నా.. మాములుగా ఉండదు: బాబీ

విధాత‌: టాలీవుడ్‌లో ఉన్న యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ల‌లో బాబి అలియాస్ కె.ర‌వీంద్ర పేరును కూడా చెప్పుకోవాలి. మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టించ‌గా ఈయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ‘ప‌వ‌ర్’ చిత్రం ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆక‌ట్టుకుంది. ఆ వెంట‌నే సామాన్యంగా ఎవ్వ‌రికో గాని ల‌భించ‌ని అరుదైన అవ‌కాశం ఆయ‌న‌కు వ‌చ్చింది.

అది ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన ‘స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్’ డైరెక్ట్ చేసే అవ‌కాశం. కానీ ఈ చిత్రం డిజాస్ట‌ర్ అయింది. ప‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వేలు పెట్టడం, ఆయ‌న చెప్పిన ప్ర‌కార‌మే బాబి తీయ‌డం వ‌ల్ల ఈ చిత్రం డిజాస్ట‌ర్ అయింద‌నే వార్త‌లు కూడా హ‌ల్‌చ‌ల్ చేశాయి.

ఇందులో కాస్త వాస్త‌వం కూడా ఉంద‌ని, అందుకే బాబిపై న‌మ్మకంతో ‘స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్’ డిజాస్ట‌ర్ అయినా పిలిచి మ‌రీ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చాన్స్ ఇవ్వ‌డం ఈ వాద‌న‌కు బ‌లం చేకూర్చింది. ఎన్టీఆర్‌ను ఏకంగా త్రిపాత్రాభిన‌యంలో చూపిస్తూ ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జైల‌వ‌కుశ ఆయ‌న‌కు మంచి పేరును తెచ్చిపెట్టింది. ముఖ్యంగా జై పాత్ర‌ను బాబి చూపిన విధానం అంద‌రికీ బాగా న‌చ్చింది.

ఆ వెంట‌నే మ‌రో సీనియ‌ర్ స్టార్ వెంక‌టేష్‌, ఆయ‌న మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌ల‌తో క‌లిసి ‘వెంకీ మామ’ తీయ‌గా ఇది కూడా క‌మ‌ర్షియ‌ల్‌గా మెప్పించింది. ఇలా ఆయ‌న అతి త‌క్కువ కాలంలోనే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, సీనియ‌ర్ స్టార్ విక్ట‌రీ వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య‌ల‌ను డైరెక్ట్ చేసి తాను స్టార్ హీరోల‌ను కూడా హ్యాండిల్ చేయ‌గ‌ల‌న‌ని నిరూపించుకున్నాడు.

దాంతో ఈసారి ఆయ‌న‌కు ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అరుదైన అవ‌కాశం వ‌చ్చింది. అందునా బాబి చిన్న‌నాటి నుంచి మెగా వీరాభిమాని. దాంతో త‌న ఫేవ‌రేట్ స్టార్‌ని డైరెక్ట్ చేసే అవ‌కాశం వ‌స్తే ఆయ‌న ఊరుకుంటాడా….? అందుకే చిరుని త‌న‌లాగా ఆయ‌న వీరాభిమానులు ఎలా చూడాల‌ని ఆశిస్తున్నారో అలా చూపించ‌బోతున్నాడంటున్నారు. సినిమా విడుద‌ల‌కు ముందే ఈ చిత్రానికి అద్భుతమైన పాజిటివ్ బ‌జ్ వ‌స్తోంది.

ఇక విష‌యానికి వ‌స్తే..

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ నటించిన వాల్తేరు వీరయ్యను ప్రేక్షకులకు చూపించడానికి తాను ఎంతగానో ఎదురు చూస్తున్నానని దర్శకుడు బాబి అంటున్నారు. ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నట్టు చెప్పాడు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను పురిష్కరించుకొని ఆయన మెగా అభిమానులతో నిర్వహించిన చర్చ కార్యక్రమంలో బాబి ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘కథ‌ రాస్తూ, సినిమా తీస్తూ నేను ఈ మాట చెప్పడం లేదు. వాల్తేరు వీరయ్య చూశాకే ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఇంద్ర‌ సినిమాకు ముందు చిరంజీవి గారు నటించిన రెండు సినిమాలు అంతగా విజయం సాధించలేదు. ఆయన నుంచి బ్లాక్ బస్టర్ వస్తే చూడాలని ఒక మెగా అభిమానిగా నేను కసిగా ఎదురు చూశా.

అలాంటి సమయంలో నా ఆకలికి తీర్చిన చిత్రం ‘ఇంద్ర’. అప్పట్లో కాలర్ ఎగరేసి తిరిగా. ఆ సినిమా చూడటం కోసం లాఠీదెబ్బలు కూడా తిన్నాను. అలాంటి నాకు మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే అవకాశం వస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. చిరంజీవి నుంచి అభిమానులు ఎలాంటి ఎలిమెంట్స్ ను కోరుకుంటున్నారో అవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి.

ఈ సినిమా మెగా అభిమానుల ఆకలి తీరుస్తుందని మాటిస్తున్నా. చిరంజీవి ఊరికే మెగాస్టార్ కాలేదు. పని పట్ల ఆయన చూపించే నిబద్దతే అందుకు నిదర్శనం. ఉదయాన్నే సెట్‌లోకి వచ్చేస్తారు. సాయంత్రం వరకు మాతోనే ఉండి ఎంతో కష్టపడేవారు. మైనస్ 8° చ‌లిలో పాట షూట్ చేశాం. యూనిట్ మొత్తం చలికి వణికిపోతుంటే ఆయన మాత్రం ఎంతో యాక్టివ్‌గా షూటింగ్లో పాల్గొన్నారు.

ఈ సినిమాకు సంబంధించి నేను ఒక విషయాన్ని లీక్ చేస్తున్నా. సినిమా మొదలైనప్పటి నుంచి వీరయ్య కనబడే ప్రతి సీన్‌లో అభిమానులు తప్పకుండా ఈల‌లు వేస్తారు. చిరంజీవి కనబడకపోయినా ప్రతి సీనులో రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఆయన పరిచయ సన్నివేశాలను పెను తుఫానులో సముద్రంపై షూటింగ్ చేశాం.

డూప్ లేకుండా సుమారు పది రోజులపాటు ఇంట్రో సీన్స్ షూట్లో పాల్గొన్నారు. ఓవైపు వాన మరోవైపు అల‌ల తాకిడి. మేమంతా కంగారు పడుతున్నా.. ఆయన మాత్రం కూల్‌గా చేసేశారు. అందుకే మాటిస్తున్నా.. ఈసారి మెగా ట్రీట్ మాములుగా ఉండదు..’’ అని బాబీ చెప్పుకొచ్చారు.