ఇంతకు.. ప్రభాస్ బ్యాంకు అప్పు ఎందుకు తీసుకున్నాడు?
విధాత: బ్యాంకు నుంచి రుణం పొందాలంటే అదో పెద్ద తతంగం. పేద మధ్యతరగతి వాళ్లకు అది చుక్కలు చూపిస్తుంది. ఏదో బంగారం మీద రుణం ఇమ్మంటే ఇస్తారు గానీ వ్యక్తిగత రుణాలు ఇవ్వడానికి జంకుతారు. ఇచ్చినా కూడా వడ్డీలపై వడ్డీలు వేసి చక్ర వడ్డీలు వసూలు చేస్తారు. ఇక విషయానికొస్తే బ్యాంకుల నుంచి రుణాలు పొందేవారు అనేక రకాలు. ఒకరు అత్యవసరమై పొందితే కొందరు తమ వ్యాపార అవసరాల కోసం తమ వద్ద డబ్బులు ఉన్నప్పటికీ బ్యాంకు […]

విధాత: బ్యాంకు నుంచి రుణం పొందాలంటే అదో పెద్ద తతంగం. పేద మధ్యతరగతి వాళ్లకు అది చుక్కలు చూపిస్తుంది. ఏదో బంగారం మీద రుణం ఇమ్మంటే ఇస్తారు గానీ వ్యక్తిగత రుణాలు ఇవ్వడానికి జంకుతారు. ఇచ్చినా కూడా వడ్డీలపై వడ్డీలు వేసి చక్ర వడ్డీలు వసూలు చేస్తారు.
ఇక విషయానికొస్తే బ్యాంకుల నుంచి రుణాలు పొందేవారు అనేక రకాలు. ఒకరు అత్యవసరమై పొందితే కొందరు తమ వ్యాపార అవసరాల కోసం తమ వద్ద డబ్బులు ఉన్నప్పటికీ బ్యాంకు నుంచి రుణం తీసుకుంటారు. కావాల్సి వస్తే ఏ ఆస్తినో తనఖా పెడతారు.
డబ్బున్న వాళ్ళందరూ రుణాలు తీసుకోరనేది ఏమీ లేదు. అంబానీ నుంచి అదాని వరకు అందరూ బ్యాంకు రుణాలను పొందిన వారే. వీరిలో కొందరు వాటిని ఎగవేసి విదేశాలకు కూడా వెళ్లిపోయారు.
ఇక విషయానికొస్తే సినిమాకి 100 నుంచి 150 కోట్లు తీసుకునే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజాగా హైదరాబాద్‌లో తనకు సంబంధించిన ఒక ఆస్తిని బ్యాంకులో తనఖా పెట్టి రుణం పొందాడట. అ
లా పొందిన ఋణం కేవలం రూ. 21 కోట్లు మాత్రమే. ప్రభాస్ రేంజ్‌తో పోలిస్తే అది ఏ మూలకి సరిపోదు. కానీ ప్రభాస్ ఎందుకు రుణం తీసుకున్నాడు? అనే విషయంలో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నేడు ఆస్తి లేని వారిది ఒక బాధ అయితే.. ఆస్తులు ఉన్న వారి బాధలు శతకోటి. ఆస్తులు ఉన్నవారు వాటిని ఎలా నిలబెట్టుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. తమ ఆస్తులు ఏ కబ్జాదారులు, రాజకీయ నాయకుల దృష్టిలో పడితే వారి సంగతి ఇక అంతే…!
అందుకనే వారు ముందు జాగ్రత్తగా ప్రమాదకరమైన ఆస్తులను ఇతరుల చూపు ఉన్న ఆస్తులను బ్యాంకులో తనఖా పెట్టి రుణం పొందుతారు. తద్వారా అది కబ్జాకు గురైన వారికి వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు.
బ్యాంకు వారే అన్ని విషయాలను చూసుకుంటారు. కాబట్టే ప్రభాస్ ఈ ముందస్తు జాగ్రత్తతో తన ఆస్తికి కబ్జాదారుల పాలు కాకుండా బ్యాంకు నుంచి రూ.21 కోట్లు రుణం తీసుకున్నాడు అని తెలుస్తోంది.