Sleeping tips | మిమ్మల్ని నిద్రలేమి సమస్య వేధిస్తోందా.. ఈ చిట్కాలతో చక్కగా నిద్రపోండి..
Sleeping tips: కంటినిండా నిద్రపోతే మనసు, శరీరం ఆరోగ్యంగా ఉంటాయి. కానీ ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆఫీసులో పని ఒత్తిడి లాంటి వాటివల్ల కొందరికి సరిగా నిద్రపట్టదు. దాంతో శారీరకంగా నీరసించిపోతారు. మానసికంగా ఆందోళన పెరుగుతుంది.
Sleeping tips: కంటినిండా నిద్రపోతే మనసు, శరీరం ఆరోగ్యంగా ఉంటాయి. కానీ ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆఫీసులో పని ఒత్తిడి లాంటి వాటివల్ల కొందరికి సరిగా నిద్రపట్టదు. దాంతో శారీరకంగా నీరసించిపోతారు. మానసికంగా ఆందోళన పెరుగుతుంది. అయితే కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందామా..?
మంచి నిద్రకు చిట్కాలు..
అశ్వగంధ
అశ్వగంధ ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా దానివల్ల అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అశ్వగంధ సహజంగా ట్రై ఎథిలిన్ గ్లైకాల్‌ను కలిగి ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపర్చడంలో తోడ్పడుతుంది. మంచి నిద్ర కోసం మీరు పడుకోవడానికి 30 నిమిషాలు ముందు అశ్వగంధను తీసుకోవచ్చు.
బాదాం
బాదాంలో ఫైబర్, మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బాదాంలో మెగ్నీషియం ఉంటుంది. నిద్ర సహాయక కారకం అయిన మెలటోనిన్ నియంత్రణకు మెగ్నీషియం అవసరం. మెగ్నీషియం మీ కండరాలను కూడా సడలింపజేస్తుంది. ఫలితంగా నిద్ర బాగా పడుతుంది.
జాజికాయ పాలు
ఒక గ్లాసు పాలలో చిటికెడు జాజికాయ కలిపి తీసుకోవడంవల్ల నిద్ర మెరుగుపడుతుంది. పాలలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది శరీరంలో సెరటోనిన్, మెలటోనిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. ఈ రెండూ మంచి నిద్రకు తోడ్పడుతాయి.
గుమ్మడి గింజలు
గుమ్మడి గింజలను పెపిటాస్ అని కూడా అంటారు. వీటిలో ట్రిప్టోఫాన్‌తోపాటు జింక్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండూ సెరటోనిన్‌ను నిర్మించడంలో సహాయపడతాయి. సెరటోనిన్ నిద్రను మెరుగుపరుస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram