Mouth ulcer | నోట్లో పుండ్లతో యాతన పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే..!
Mouth ulcer : బాడీలో వేడి ఎక్కువగా ఉండే వాళ్లను, పంటి ఇన్‌ఫెక్షన్‌లు ఉన్నవాళ్లను నోటిపూత (నోట్లో పుండ్లు పడటం) తీవ్రంగా వేధిస్తుంది. నోటిపూత వల్ల భయంకరమైన నొప్పి ఉంటుంది. పుండు నోట్లో ఎక్కడ ఉన్నా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. అయితే వేడి బాగా ఉన్నప్పుడు నోరంతా పుండ్లు పడుతాయి.
Mouth ulcer : బాడీలో వేడి ఎక్కువగా ఉండే వాళ్లను, పంటి ఇన్‌ఫెక్షన్‌లు ఉన్నవాళ్లను నోటిపూత (నోట్లో పుండ్లు పడటం) తీవ్రంగా వేధిస్తుంది. నోటిపూత వల్ల భయంకరమైన నొప్పి ఉంటుంది. పుండు నోట్లో ఎక్కడ ఉన్నా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. అయితే వేడి బాగా ఉన్నప్పుడు నోరంతా పుండ్లు పడుతాయి. ఇక ఆ నరకయాతన వర్ణనాతీతం. ఇంతలా వేధించే ఈ నోటిపూత సమస్య నుంచి చిన్నచిన్న చిట్కాలతో బయటపడవచ్చు. మరి ఆ సింపుల్ చిట్కామిటో ఇప్పుడు తెలుసుకుందాం..
చిట్కాలు
- కొబ్బరి నీళ్లను బాగా తాగాలి. కొబ్బరి నీళ్లకు ఒంట్లో వేడిని తగ్గించే లక్షణం ఉంటుంది. కాబట్టి కొబ్బరి నీళ్లు తాగడంవల్ల ఒంట్లో వేడి తగ్గి సమస్య పరిష్కారమవుతుంది.
- ఎండు కొబ్బరిని నమలడంవల్ల కూడా మంచి పరిష్కారం లభిస్తుంది. ఇలా ఎండు కొబ్బరి నమలడంవల్ల అల్సర్ పుండ్లలోని సూక్ష్మజీవులు నశించిపోతాయి. దాంతో నోటిలో అల్సర్స్ త్వరగా తగ్గిపోతాయి.
- అల్సర్ ఉన్న ప్రాంతాల్లో కొబ్బరి నూనె రాయడంవల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. ఇన్‌ఫెక్షన్ త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
- తరచూ చల్ల తాగడంవల్ల కూడా అల్సర్స్ సమస్యకు పరిష్కారం ఉంటుంది. చల్లకు కూడా శరీరంలో వేడిని తగ్గించే లక్షణం ఉన్నది.
- గసగసాలు కూడా నోటిపూతను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి. గసగసాలు కలిపిన నీటిని తరచూ తాగుతూ ఉండటంవల్ల సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు.
- అదేవిధంగా తులసి ఆకులను నములుతూ దాని ద్వారా వచ్చే రసాన్ని మింగడం ద్వారా కూడా నోటిపూతకు పరిష్కారం లభిస్తుంది.
- గమనిక : పై చిట్కాలు సమస్య రాకుండా చూసుకోవడానికి, వచ్చిన సమస్య నిదానంగా తగ్గడానికి తోడ్పడుతాయి. ఒకవేళ మీకు నోరంతా పుండ్లుపడి భరించలేకుండా ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించి మెడికేషన్ తీసుకోవడం ఉత్తమం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram