Tooth Brush | 3 నెలలకు మించి టూత్ బ్రష్ వాడుతున్నారా..? గుండె జబ్బులు దరి చేరినట్లే..!
Tooth Brush | నోటిని( Mouth ) శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎదుకంటే మనం తినే ఆహారం నోటి ద్వారా జీర్ణాశయంలోకి చేరుతుంది. కాబట్టి ఆహారం( Food ) తినే నోటిని శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి రోగాలు( Diseases ) దరి చేరవు. మరి నోటిని శుభ్రంగా ఉంచుకోవాలంటే బ్రష్( Tooth Brush ) తప్పనిసరి చేయాలి.

Tooth Brush | నోటిని( Mouth ) శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎదుకంటే మనం తినే ఆహారం నోటి ద్వారా జీర్ణాశయంలోకి చేరుతుంది. కాబట్టి ఆహారం( Food ) తినే నోటిని శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి రోగాలు( Diseases ) దరి చేరవు. మరి నోటిని శుభ్రంగా ఉంచుకోవాలంటే బ్రష్( Tooth Brush ) తప్పనిసరి చేయాలి. అయితే బ్రష్‌ను ఎప్పటికప్పుడు మార్చడం, నాణ్యమైన బ్రష్‌లను ఉపయోగించడం ద్వారా నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని దంత నిపుణులు చెబుతున్నారు. మరి టూత్ బ్రష్( Tooth Brush )ను ఎన్ని రోజులకు మార్చాలి..? ఎంత సమయం దంతాలను తోమాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
నోటిని శుభ్రంగా ఉంచుకుంటే చాలా వరకు రోగాలకు దూరంగా ఉన్నట్లే. దంతాలు( Teeth ), చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటేనే మనం తీసుకునే ఆహారాన్ని మెత్తగా నమలగలం. నోటి శుభ్రతను నిర్లక్ష్యం చేస్తే దంతక్షయం, చిగుళ్ల వ్యాధులు, నోటి దుర్వాసన వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు తలెత్తకూడదంటే.. టూత్ బ్రష్( Tooth Brush )ని ఎక్కువ కాలం ఉపయోగించకూడదని చెబుతున్నారు. నోటి అపరిశుభ్రత అనేది గుండె జబ్బులకు( Heart Diseases ) కూడా దారి తీస్తుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్( Health Experts ) హెచ్చరిస్తున్నారు.
మరి ఎన్ని నెలలకు టూత్ బ్రష్ మార్చాలి..?
ప్రతి రోజు బ్రష్‌తో దంతాలు తోమే వారు.. ప్రతి మూడు నెలలకు ఒకసారి టూత్ బ్రష్‌ను మార్చాలని డెంటిస్టులు( Dentists ) సూచిస్తున్నారు. బ్రష్ ఎంత బాగున్నా సరే మార్చేయాలని స్పష్టం చేస్తున్నారు. మూడు నెలల తర్వాత బ్రెసిల్స్ రూపు కోల్పోతాయని, దీంతో ఎంతసేపు దంతాలు తోమినా.. శుభ్రం కాకపోగా, దంత సమస్యలకు దారి తీస్తాయని చెబుతున్నారు.
టూత్ బ్రష్‌లపై సూక్ష్మజీవులు..!
బ్రష్ బాగున్నా కూడా కొన్నిరోజులకు ఇది సూక్ష్మజీవులకు ఆవాసంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా చాలా వరకూ వీటిని సింకుల దగ్గర, బాత్రూమ్ల్లోనే ఉంచుతుంటారని, ఇలా చేయడం వల్ల టూత్ బ్రష్‌లపై సూక్ష్మజీవులు చేరుతాయని హెచ్చరిస్తున్నారు. ఇవి గుండెజబ్బులు, ఆర్థరైటిస్, స్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల వ్యాప్తికి కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎంత సేపు దంతాలు తోమాలి..?
నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉదయం నిద్రలేవగానే, రాత్రి పడుకునే ముందు ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో కనీసం రెండు నిమిషాల పాటు బ్రష్ చేయాలని డెంటిస్టులు సూచిస్తున్నారు. ఎక్కువ సేపు దంతాలు తోమితే.. అవి అరిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.