Curry Leaves | క‌రివేపాకు కంటి చూపున‌కే కాదు.. గుండె ఆరోగ్యానికి కూడా మంచి ఔష‌ధం..!

Curry Leaves | క‌రివేపాకు( Curry Leaves ).. ఈ పేరు అంద‌రికీ సుప‌రిచిత‌మే. క‌రివేపాకు లేకుండా ఏ వంట‌కం కూడా చేయ‌రు. అయితే ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉన్న క‌రివేపాకును ప్ర‌తి రోజు ఉద‌యం( Morning ) ప‌ర‌గ‌డుపున తింటే ఎన్నో బెనిఫిట్స్( Health Benefits ) క‌లుగుతాయ‌ట‌.

  • By: raj    health    Mar 02, 2025 9:00 AM IST
Curry Leaves | క‌రివేపాకు కంటి చూపున‌కే కాదు.. గుండె ఆరోగ్యానికి కూడా మంచి ఔష‌ధం..!

Curry Leaves | ప్ర‌తి ఇల్లాలు వంట చేసే ముందు.. క‌రివేపాకు( Curry Leaves ) ఉందా..? లేదా..? అని చెక్ చేసుకుంటుంటారు. ఎందుకంటే క‌రివేపాకు లేకుండా కూర‌లు( Curries ) చేస్తే.. రుచి రాదు. క‌చ్చితంగా క‌రివేపాకును కూర‌ల్లో వేస్తే.. మంచి ఫ్లేవ‌ర్‌ని ఇస్తుంది. దాంతో కూర రుచిగా ఉంటుంది. మ‌రి క‌రివేపాకు వంట‌కాల వ‌ర‌కే ప‌రిమిత‌మా..? అంటే కానే కాద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మ‌ధుమేహం, జీర్ణ స‌మ‌స్య‌లు, గుండె జ‌బ్బుల‌తో బాధ‌ప‌డేవారు క‌రివేపాకును రెగ్యుల‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల వాటి నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మ‌రి క‌రివేపాక‌ను ఏ స‌మ‌యంలో తీసుకోవాలి.. ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం..

క‌రివేపాకులో పుష్క‌లంగా పోష‌కాలు..

మ‌న నిత్యం ఉప‌యోగించే కరివేపాకులో పోషకాలు స‌మృద్ధిగా ల‌భిస్తాయి. ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖ‌నిజాలతో పాటు విటమిన్ ఎ, బి, సి, ఇ పుష్క‌లంగా ల‌భిస్తాయి. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, కార్బజోల్ ఆల్కలాయిడ్స్ వంటి బయోయాక్టివ్ కాంపౌండ్​లతో నిండి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అందుకే దీనిని ప‌ర‌గ‌డుపునే తీసుకుంటే మంచిదంటున్నారు.

క‌రివేపాకుతో జీర్ణ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టండిలా..

కరివేపాకు జీర్ణసమస్యలను తగ్గించి.. జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌రుస్తుంది. క‌రివేపాకులోని ఎంజైమ్స్ కడుపులో మిగిలిన ఉన్న ఆహారాన్ని త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి. అంతేకాకుండా కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్​ఫ్లమేటరీ లక్షణాలు కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను తగ్గిస్తాయి.

రోగ నిరోధ‌క శ‌క్తిని పెంపొందిస్తుంది..

క‌రివేపాకు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఈ ఆకులోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీరాడికల్స్​ నుంచి కాపాడి ఇమ్యూనిటీని మెరుగుపరుస్తాయి. ఆర్థ్రరైటిస్ సమస్యలను యాంటీఇన్​ఫ్లమేటరీ లక్షణాలు దూరం చేస్తాయి. స్కిన్​ ఇరిటేషన్​ను తగ్గించి.. పింపుల్స్ సమస్యను దూరం చేస్తాయి.

చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తుంది..

గుండె స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు క‌రివేపాకును తిన‌డం మంచిది. ఎందుకంటే కరివేపాకును పరగడుపునే తీసుకుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగ‌వుతుంది. అలాగే రక్తంలోని షుగర్ కంట్రోల్ అవుతుంది. కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు బ్లడ్​లోని షుగర్​ని పెరగకుండా అదుపులో ఉంచుతాయి.

మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు..

ఉదయాన్నే వీటిని తినడం వల్ల ఫ్రెష్ బ్రీత్ మీ సొంతమవుతుంది. నోటి దుర్వాసన ఉన్నవారు దీనిని రెగ్యులర్​గా ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు కంటి చూపు మందగించకుండా.. వయసు పెరిగే కొద్ది సమస్యలు రాకుండా హెల్ప్ చేస్తాయి. టైప్ 2 డయాబెటిస్, ఇతర నొప్పులు, జుట్టు పెరుగుదల, అనేమియా, బరువు తగ్గడంలో ఇవి మంచి ఫలితాలు ఇస్తాయి.

మ‌రి ఎన్ని క‌రివేపాకుల‌ను తీసుకోవాలి..?

రోజుకు 5 నుంచి 7 కరివేపాకులను ప‌ర‌గ‌డుపున నమిలి తినొచ్చు. లేతవి తీసుకుంటే ఘాటు తక్కువగా ఉంటుంది. ఫ్రెష్ ఆకులు అయితే మరీ మంచిది. లేదంటే కరివేపాకును నీటిలో వేసి హెర్బల్ టీగా తీసుకోవచ్చు.