Weight Loss | అధిక బరువుతో బాధపడుతున్నారా..? నీటితో బరువు తగ్గించుకోండిలా..!
Weight Loss | అధిక బరువుతో బాధపడుతున్నారా..? వాకింగ్( Walking ), ఎక్సర్‌సైజులు చేసేంత సమయం లేదా..? ఏం చింతించాల్సిన అవసరం లేదు. మనకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండే నీటి( Water )తో కూడా బరువు తగ్గించుకోవచ్చు.

Weight Loss | ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్ గడుపుతున్నారు. రాత్రింబవళ్లు పనుల మీదనే ధ్యాస పెడుతున్నారు. కానీ ఆరోగ్యం( Health )పై దృష్టి సారించడం లేదు. ఈ సమయంలో ఇష్టమొచ్చిన తిండి తిని అధికంగా బరువు( Weight ) పెరిగిపోతున్నారు. బరువు తగ్గించుకునేందుకు కనీసం వ్యాయామం( Exercise ) కూడా చేయడం లేదు. ఈ కారణంగా అనేక అనారోగ్య సమస్యల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. కాబట్టి బరువు తగ్గించుకుంటే అనారోగ్యాలను దూరంగా ఉంచినట్టే. అయితే బరువు తగ్గేందుకు కేవలం వాకింగ్( Walking ), ఎక్సర్‌సైజులతోనే పని లేదు. నీటి( Water )తో కూడా బరువు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి నీటితో బరువు ఎలా తగ్గాలో తెలుసుకుందాం.
నీటితో బరువు తగ్గేందుకు ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..
1. నీటిని రెగ్యూలర్‌గా తీసుకుంటూ ఉంటే.. మెటబాలీజం పెరుగుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. కడుపు ఉబ్బరం తగ్గుతుంది. శరీరంలోనుంచి టాక్సిన్లు బయటకు వస్తాయి.
2. రోజుకు 8 నుంచి పది గ్లాసుల నీటిని తీసుకోవాలి. భోజనం చేసే ముందు ఓ గ్లాస్ నీటిని తాగాలి. దీనివల్ల కడుపు నిండుగా ఉంటుంది. తక్కువ తింటారు.
3. ఇన్ఫ్యూజ్ చేసిన నీటిని తీసుకుంటే మరింత బెనిఫిట్స్ ఉంటాయి. నిమ్మకాయలు, పుదీనా, కీరదోస, అల్లం వేసిన నీటిని రాత్రుళ్లు నానబెట్టి.. ఉదయాన్నే తీసుకుంటే చాలా మంచిది.
4. యూరిన్ కలర్లో మార్పులతో కూడా మీ శరీరంలో నీటి శాతాన్ని లెక్కించవచ్చు. పేల్ ఎల్లో కలర్ వస్తుంటే మీరు నీటిని సరైన మోతాదులో తీసుకోవట్లేదని అర్థం.
5. హైడ్రేటెడ్‌గా ఉండేందుకు కీరదోస, పుచ్చకాయ, స్ట్రాబెర్రీ, సెలరీ టోమాటోలను డైట్లో చేర్చుకోవచ్చు.