చిన్నవయసులోనే తలనెరుస్తోందా..? ఇవి పాటించి చూడండి..!
విధాత: ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే చాలా మంది జుట్టు తెల్లగా మారుతున్నది. గతంలో వృద్ధాప్యం సమయంలోనే తలనెరవడం చూశాం. కానీ, మారుతూ వస్తున్న జీవనశైలి, పొల్యూషన్ కారణంగా ఎక్కువ మంది యువత ఈ సమస్యతో బాధపడుతున్నారు. జట్టు నెరవడం వ్యక్తిత్వంపై చెడు ప్రభావం చూపడంతో పాటు రూపాన్ని సైతం మార్చి వేస్తుంది. ఈ క్రమంలో చాలా మంది తలకు రంగులు వేయడం ప్రారంభిస్తారు. అయితే, రంగులు జుట్టు సమస్యను మరింత పెంచుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని […]
విధాత: ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే చాలా మంది జుట్టు తెల్లగా మారుతున్నది. గతంలో వృద్ధాప్యం సమయంలోనే తలనెరవడం చూశాం. కానీ, మారుతూ వస్తున్న జీవనశైలి, పొల్యూషన్ కారణంగా ఎక్కువ మంది యువత ఈ సమస్యతో బాధపడుతున్నారు.
జట్టు నెరవడం వ్యక్తిత్వంపై చెడు ప్రభావం చూపడంతో పాటు రూపాన్ని సైతం మార్చి వేస్తుంది. ఈ క్రమంలో చాలా మంది తలకు రంగులు వేయడం ప్రారంభిస్తారు. అయితే, రంగులు జుట్టు సమస్యను మరింత పెంచుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని ఆహారాలు, చిట్కాలు పాటించడం ద్వారా తెల్ల జుట్టు సమస్యను వదిలించుకోవచ్చని తెలిపారు.
పోషకాహారం తీసుకోవాలి
తెల్లజుట్టు సమస్య రాకుండా ఉండాలంటే పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం పండ్లు, కూరగాయలు తినాలి. అంతేకాకుండా శీతాకాలంలో కాస్త ఉదయం పూట ఎండలో తిరగాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉండే విటమిన్ డీ పుష్కలంగా లభిస్తుంది.
తలకు మసాజ్ చేసుకోవాలి
తెల్లజుట్టు సమస్యతో సతమతమవుతున్న వారు వారానికి ఒకసారి తలకు బాగా మసాజ్ చేసుకోవాలి. తద్వారా మైక్రో సర్క్యులేషన్ మెరుగుపడి జుట్టు మూలాలకు రక్తాన్ని సక్రమంగా సరఫరా అవుతుంది. వారం వారం తప్పనిసరిగా మసాజ్ చేసుకుంటూ వస్తే జుట్టు దృఢంగా ఉండడంతో పాటు తెల్లజుట్టు సమస్య నుంచి బయటపడతారు.
రంగువేయడం మానండి..
కొంతమంది జుట్టు తెల్లగా మారినప్పుడు వెంటనే హెయిర్‌డైలు వాడడం మొదలుపెడతారు. ఇందులో ఉండే రసాయనాలు తెల్లజుట్టు సమస్యను మరింత పెంచుతాయి. జుట్టుకు హాని చేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఏమాత్రం డైలు వాడడం మంచిదికాదు.
వ్యాయామం చేయాలి
వ్యాయామం సైతం జుట్టుపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. ప్రతి ఒక్కరూ రోజూ దాదాపు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram