Brinjal | వర్షాకాలంలో వంకాయతో ముప్పు..! జర జాగ్రత్త..!
Brinjal | మీరు వంకాయ( Brinjal ) ప్రియులా..? ఘుమఘుమలాడే గుత్తి వంకాయను ఆరగించాలని ఆత్రుత పాడుతున్నారా..? కానీ ఈ వర్షాకాలం( Monsoon )లో నిగనిగలాడే వంకాయను తింటే.. ఆరోగ్యానికి ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు( Health Experts ) హెచ్చరిస్తున్నారు.

Brinjal | కూరగాయల్లో రారాజు ఎవరంటే వంకాయ( Brinjal ) అని చెప్పొచ్చు. ఎందుకంటే వంకాయ ఒక రుచికరమైన, పోషకాలతో కూడి ఉంటుంది. ఈ వంకాయను రకరకాలుగా వండుకుని ఆరగిస్తుంటారు. ఏ విధంగా వండిన ఒక ముక్క కూడా మిగలకుండా వంకాయను ఇష్టంగా తింటారు.
అయితే వర్షాకాలం( Monsoon )లో వంకాయను తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు( Health Experts ) హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో వంకాయలలో పురుగులు పెరుగుతాయి. వంకాయలు బయటికి నిగనిగలాడినప్పటికీ.. వాటిని కోసిన తర్వాత పురుగులు కనిపిస్తుంటాయి. అందుకే వంకాయలను కోసిన తర్వాత బాగా కడిగినా, వాటి లోపల పురుగుల గుడ్ల అవశేషాలు మిగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వంకాయలను కూరగా చేసుకుని తింటే.. వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో వర్షాకాలంలో వంకాయకు దూరంగా ఉండడం మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
వంకాయతో పాటు పొరపాటున కూడా పుట్టగొడుగులను తినకూడదు. పుట్టగొడుగులను తిన్నా కూడా మనం వ్యాధులను ఆహ్వానించినట్లు అవుతుంది. పుట్టగొడుగుల్లోని అతి సన్నని పొరల్లో బ్యాక్టీరియా సులభంగా పెరుగుతుంది. మనం ఎంత కడిగినా, ఆ బ్యాక్టీరియా దాని నుంచి వెళ్లిపోదు. అందుకే వర్షాకాలంలో పుట్టగొడుగులకు దూరంగా ఉండడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వర్షాకాలంలో పాలకూర కూడా పరేషాన్ చేస్తుంది. చాలా మంది బరువు తగ్గడానికి పాలకూర జ్యూస్ తాగుతుంటారు. అయితే వర్షాకాలంలో పాలకూరకు దూరంగా ఉండాలి. ఎందుకంటే పాలకూర ఆకులపై పురుగులు తిరుగుతుంటాయి. మనం నీటితో పాలకూరను శుభ్రం చేశాక కూడా, దాని ఆకులపై కంటికి కనిపించనంత అతిసూక్ష్మమైన పురుగుల గుడ్లు మిగిలిపోతాయి. ఇలాంటి పాలకూరను తింటే, అవి మన కడుపులోకి చేరాక విరేచనాలు అవుతాయి.