Kidney Stones | ఈ లక్షణాలు ఉంటే.. మీ కిడ్నీలో రాళ్లు ఉన్నట్టే..?
Kidney Stones | చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటారు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడితే.. నరకయాతన అనుభవించాల్సి వస్తుంది. మూత్ర విసర్జన సమయంలో నొప్పిగా ఉంటుంది. ఇతర సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. అయితే మూత్ర పిండాల్లో రాళ్లు ఒకేసారి ఏర్పడవు. కిడ్నీల్లో ఖనిజాలు పేరుకుపోయి, అవి గట్టిపడి రాళ్ల మాదిరిగా మారుతాయి. అయితే అలా ఏర్పడిన రాళ్లు మూత్రపిండాల్లోనే ఉండొచ్చు. లేదంటా మూత్రనాళాల్లోకి కూడా వెళ్లొచ్చు. దీని వల్ల అనేక సమస్యలు ఏర్పడుతాయి. కిడ్నీలో రాళ్లు అనేది […]

Kidney Stones |
చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటారు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడితే.. నరకయాతన అనుభవించాల్సి వస్తుంది. మూత్ర విసర్జన సమయంలో నొప్పిగా ఉంటుంది. ఇతర సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి.
అయితే మూత్ర పిండాల్లో రాళ్లు ఒకేసారి ఏర్పడవు. కిడ్నీల్లో ఖనిజాలు పేరుకుపోయి, అవి గట్టిపడి రాళ్ల మాదిరిగా మారుతాయి. అయితే అలా ఏర్పడిన రాళ్లు మూత్రపిండాల్లోనే ఉండొచ్చు. లేదంటా మూత్రనాళాల్లోకి కూడా వెళ్లొచ్చు. దీని వల్ల అనేక సమస్యలు ఏర్పడుతాయి.
కిడ్నీలో రాళ్లు అనేది ఒకే రోజులో ఏర్పడవు. రాళ్ల మాదిరిగా ఏర్పడటానికి నెలల సమయం పడుతుంది. ఈ సమయంలో మన శరీరంలో కొన్నిమార్పులు సంభవిస్తాయి. ఆ మార్పులను పసిగడితే.. రాళ్ల పరిమాణం పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
మరి లక్షణాలు ఏంటో చూద్దాం..
కిడ్నీలో రాళ్లు ఏర్పడిన వారి పొత్తి కడుపులో నొప్పిగా అనిపిస్తుంది. ఒక వైపు లేదా రెండు వైపులా వెన్ను నొప్పి వస్తుంది. పొత్తి కడుపులో లేదా, పొత్తి కడుపు పైభాగంలో, వెనుక భాగంలో ఆకస్మికంగా నొప్పి వచ్చి తగ్గిపోతోంది. మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పిగా, మంటగా అనిపిస్తుంది. ఈ సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.
మూత్రం రంగు మారినా కూడా..
మూత్రం రంగు మారినా కూడా అది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడేందుకు మొదటి లక్షణంగా భావించాలి. గులాబీ, గోధుమ, ఎరుపు రంగులో మూత్రం రంగు మారితే అది కూడా కిడ్నీ స్టోన్ లక్షణమే. వికారం, వాంతులు వచ్చినా కూడా మూత్రపిండాల్లో రాళ్ల వల్లే అని అనుమానించాలి. ఆకస్మికంగా ఫీవర్ వచ్చి తగ్గిపోతుంటే కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ..
మూత్రపిండాల్లో స్టోన్స్ ఏర్పడటం అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో సాధారణ సమస్య అయిపోయింది. అయితే ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే తగిన మోతాదులో నీళ్లు తాగాలి. దీంతో ఒక వేళ రాళ్లు ఏర్పడిన మూత్రం ద్వారా వెళ్లిపోతాయి. తులసి, యాపిల్స్, ద్రాక్ష వంటి పండ్లు తినడం వల్ల కిడ్నీలను రక్షించుకోవచ్చు.