Mango | మామిడి పండ్లు.. శృంగారంపై ఆసక్తిని పెంచుతాయట..!
Mango | పండ్లలో మహారాజు ఏది అంటే మామిడి పండు( Mango Fruit ). మరి ఆ పండ్ల సీజన్ వచ్చేసింది. ఇక మామిడి పండు పేరు వింటేనే నోరూరిపోతుంది. ఈ పండును తినడాని అన్ని వయసుల వారు ఆసక్తి చూపిస్తారు. ఆరోగ్యానికి( Health ) ఎంతో మేలు కూడా ఈ పండు. అంతే కాదు.. దంపతుల్లో( Couples ) శృంగార ఆసక్తిని కూడా పెంచుతుందట..! ఇంకేముంది మరి మామిడి సీజన్ ఎలాగూ వచ్చేసింది కాబట్టి.. మామిడి […]

Mango | పండ్లలో మహారాజు ఏది అంటే మామిడి పండు( Mango Fruit ). మరి ఆ పండ్ల సీజన్ వచ్చేసింది. ఇక మామిడి పండు పేరు వింటేనే నోరూరిపోతుంది. ఈ పండును తినడాని అన్ని వయసుల వారు ఆసక్తి చూపిస్తారు. ఆరోగ్యానికి( Health ) ఎంతో మేలు కూడా ఈ పండు. అంతే కాదు.. దంపతుల్లో( Couples ) శృంగార ఆసక్తిని కూడా పెంచుతుందట..! ఇంకేముంది మరి మామిడి సీజన్ ఎలాగూ వచ్చేసింది కాబట్టి.. మామిడి పండ్లను సంపూర్ణంగా తినండి.. సంసార జీవితాన్ని హాయిగా గడపండి.
- మామిడి పండ్లు శృంగార ఆసక్తిని పెంచడమే కాదు.. పాలతో కలిపి తీసుకుంటే ఇంకా మంచి బలవర్ధకంగా పని చేస్తుంది.
- మామిడి పండు పిత్త, వాత దోషాలను కూడా తగ్గిస్తుందట.
- మలబద్దకం ఉన్న వారికి మామిడి పండ్లు చాలా దోహదం చేస్తాయట.
- మామిడి పండ్లను తినడంతో చర్మం కూడా నిగనిగలాడుతుందట.
- వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయట.
- జీర్ణ సమస్యలు, రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్, సోరియాసిస్, ల్యూపస్ వంటి ఆటో ఇమ్యూన్ జబ్బులు ఉన్నవారు మామిడి పండ్లను పాలతో కలిపి తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.