AI Blood Test | ప్రస్తుతకాలంలో చాలా మంది ఇబ్బందిపడుతున్న ఆరోగ్య సమస్యల్లో ‘ఆస్టియో ఆర్థరైటిస్’ ఒకటి. మారుతూ వస్తున్న జీవనశైలి, ఆహారంలో మార్పులతో పాటు పలు కారణాలతో ఆరోగ్య సమస్యలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే, ముందుగానే గుర్తిస్తే.. అవసరమైన జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. సాధారణంగా ప్రత్యేకమైన ఎక్స్‌రేల ద్వారా ‘ఆస్టియో ఆర్థరైటిస్’ వచ్చే అవకాశాన్ని ముందుగానే గుర్తించే వీలుంటుంది.
AI Blood Test | ప్రస్తుతకాలంలో చాలా మంది ఇబ్బందిపడుతున్న ఆరోగ్య సమస్యల్లో ‘ఆస్టియో ఆర్థరైటిస్’ ఒకటి. మారుతూ వస్తున్న జీవనశైలి, ఆహారంలో మార్పులతో పాటు పలు కారణాలతో ఆరోగ్య సమస్యలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే, ముందుగానే గుర్తిస్తే.. అవసరమైన జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. సాధారణంగా ప్రత్యేకమైన ఎక్స్‌రేల ద్వారా ‘ఆస్టియో ఆర్థరైటిస్’ వచ్చే అవకాశాన్ని ముందుగానే గుర్తించే వీలుంటుంది. అయితే తాజాగా ఏకంగా ఎనిమిదేళ్ల ముందే వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ ముప్పును కేవలం బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకునే విధానాన్ని శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు. ఆస్టియో ఆర్థరైటిస్‌పై పరిశోధన చేపట్టిన శాస్త్రవేత్తలు సుమారు 200 మంది మహిళల నుంచి పదేళ్ల పాటు తరచూ రక్తం నమూనాలను తీసుకుని పరిశీలించారు. వయసు, శరీర బరువు ఆధారంగా అంచనా వేశారు. ఇందులో కొందరు మహిళలు ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య బారినపడడంతో వారి రక్తంలోని ఏయే ప్రొటీన్ల స్థాయుల్లో తేడాలు వచ్చాయో గుర్తించారు.
ఈ ప్రొటీన్స్ లెవన్స్ను కృత్రిమ మేధ (IA) సాయంతో వాటిని విశ్లేషించారు. ఇందులో ఆస్టియో ఆర్థరైటిస్‌కి కారణమయ్యే ఆరు ప్రత్యేక ప్రొటీన్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ తర్వాత రక్తంలో వీటి గుర్తించేలా గుర్తించేలా బ్లడ్ టెస్ట్‌ని అభివృద్ధి చేశారు. పురుషుల్లోనూ విస్తృత పరిశోధన జరిపిన తర్వాత ఈ కొత్త బ్లడ్టెస్ట్ని అందుబాటులోకి తెస్తామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వాస్తవానికి ఆస్టియో ఆర్థరైటిస్‌కు ఎలాంటి చికిత్స లేదు. సోకే ప్రమాదం ముందస్తుగా తెలిస్తే.. దాని బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన అమెరికాలోని నార్త్ కరొలినా డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్త వర్జినియా బేయర్స్ క్రాస్ పేర్కొన్నారు. ముఖ్యంగా మోకాళ్లపై ఒత్తిడి పడే వ్యాయామాలకు దూరంగా ఉండాలన్నారు. రన్నింగ్, జాగింగ్ తగ్గించడంతో పాటు భవనాల మెట్లు ఎక్కకపోవడం వంటి వాటికి దూరంగా ఉండవచ్చని వివరించారు.