Health tips | షుగర్‌ పేషెంట్‌లు సమస్యను తగ్గించుకోవాలంటే ఈ మూడింటిని తప్పక పాటించాలి..!

Health tips : ఏటికేడు షుగర్‌ పేషెంట్‌ల సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు వృద్ధులలో మాత్రమే షుగర్‌ వ్యాధిగ్రస్తులు ఉండేవారు. ఇప్పుడు పసిపిల్లల నుంచి కురువృద్ధుల వరకు అన్ని స్థాయిల్లో మధుమేహులు ఉంటున్నారు. ఈ మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం. లేదంటే రోగాల కుప్పగా మారాల్సిన పరిస్థితి వస్తుంది. శ‌రీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తగ్గించాలంటే ముందుగా అది మ‌న‌లో ఏ స్థాయిలో ఉందో చెక్ చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

Health tips | షుగర్‌ పేషెంట్‌లు సమస్యను తగ్గించుకోవాలంటే ఈ మూడింటిని తప్పక పాటించాలి..!

Health tips : ఏటికేడు షుగర్‌ పేషెంట్‌ల సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు వృద్ధులలో మాత్రమే షుగర్‌ వ్యాధిగ్రస్తులు ఉండేవారు. ఇప్పుడు పసిపిల్లల నుంచి కురువృద్ధుల వరకు అన్ని స్థాయిల్లో మధుమేహులు ఉంటున్నారు. ఈ మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం. లేదంటే రోగాల కుప్పగా మారాల్సిన పరిస్థితి వస్తుంది. శ‌రీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తగ్గించాలంటే ముందుగా అది మ‌న‌లో ఏ స్థాయిలో ఉందో చెక్ చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. యూకేకు చెందిన ఈస్థర్ వాల్డెన్ డ‌యాబెటిస్‌కు సంబంధించి సీనియ‌ర్ క్లినిక‌ల్ అడ్వైజ‌ర్. ఆయ‌న తెలిపిన వివ‌రాల ప్రకారం.. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవ‌డం ద్వారా గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం, కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించుకోవ‌చ్చు.

మనలో షుగర్‌ లెవల్స్‌ స్థాయినిబట్టి మెడికేషన్‌ అవసరమవుతుంది. షుగర్‌ ఎక్కువగా ఉంటే ఎక్కువ డోస్‌ మెడికేషన్‌ ఇస్తారు. తక్కువగా ఉంటే తక్కువ డోస్‌ మెడికేషన్‌ ఇస్తారు. కేవలం మెడికేషన్‌తో షుగర్‌ను పెరగకుండా మాత్రమే ఉంచగలం. అంతేతప్ప ఉన్న షుగర్‌ స్థాయిలను ఏమాత్రం తగ్గించుకోలేం. షుగర్‌ స్థాయిలు తగ్గాలంటే మెడికేషన్‌తోపాటు ఈ కింది మూడు అలవాట్లను అలవర్చుకోవాలి. ఈ మూడు అలవాట్లను క్రమం తప్పకుండా పాటిస్తూ పోతే మీలో షుగర్ స్థాయిలు కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తాయి. దానికి తగ్గట్టుగానే మెడికేషన్ అవసరం కూడా తగ్గుతూ వస్తుంది. మరి అలవర్చుకోవాల్సిన ఆ మూడు అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

డైలీ వాకింగ్‌

ఆప్టిబాక్ ప్రోబయాటిక్స్‌లో న్యూట్రిషనల్ థెరపిస్ట్‌గా ప‌నిచేస్తున్న క్యారీ బీసన్.. సాధారణ నడక కూడా ఒక వ్యక్తి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుందని చెప్పారు. వాస్తవానికి నడక హృద‌య స్పంద‌న రేటును పెంచుతుంది. దాంతో శ్వాస వేగ‌వంతం అవుతుంది. ఈ కారణంగా రక్తం మన శరీరంలోని ప్రతి భాగానికి చేరుకుంటుంది. కండరాలు ఉత్తేజిత‌మ‌వుతాయి. అందువ‌ల్ల మ‌ధుమేహులు ప్రతి రోజు 15 నుంచి 30 నిమిషాలు నడవడం మంచిది. మీకు ప్రతిరోజూ న‌డ‌వ‌డం వీలుప‌డ‌క‌పోతే ఇంట్లోనే కొన్ని వ్యాయామాలు చేయవచ్చని క్యారీ బీస‌న్ చెప్పారు.

డైలీ మెడిటేషన్‌

షుగర్‌ స్థాయిలు తగ్గాలంటే శారీరక శ్రమతోపాటు మానసిక ప్రశాంతత కూడా అవసరం. నడక ద్వారా, వ్యాయామం ద్వారా శరీరం ఉత్తేజితమవుతుంది. మరి మానసిక ఉల్లాసం కూడా కావాలి. అందుకు ధ్యానం (మెడిటేషన్‌) బాగా తోడ్పడుతుంది. నిత్యం యోగా లాంటివి చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించవచ్చని బీసన్‌ తెలిపారు. అదేవిధంగా మ‌ధుమేహులు త‌మ శ‌రీరాన్ని డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. అందుకోసం ప్రతిరోజూ క‌నీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి.

లో షుగర్‌ ఫుడ్స్‌

మెడికేషన్‌, వాకింగ్‌, మెడిటేషన్‌తోపాటు అధిక చక్కెరలు ఉండే ఆహరాపదార్థాలకు దూరంగా ఉండటం కూడా మధుమేహాన్ని కంట్రోల్‌ చేస్తుంది. ఆహారం రక్తంలో చక్కెర స్థాయిని కూడా ప్రభావితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చక్కెర అధికంగా ఉండే ప్రాసెస్ చేయబడిన, శుద్ధిచేసిన ఆహారాన్ని తీసుకోకూడదు. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం కూడా తగ్గించాలి. అదేవిధంగా చక్కెర పానీయాలు, తెల్ల అన్నం, తెల్లటి బ్రెడ్‌ల‌ను తిన‌డం కూడా మానుకోవాలి.