Health tips | ‘డెంగీ’ బారినపడకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి..!
Health tips : వానాకాలం వచ్చిందంటే చాలు జనాలను డెంగీ జ్వరం (Dengue fever) గడగడలాడిస్తుంది. ఎందుకంటే ఈ వైరల్ ఫీవర్ బారినపడితే రోగిలోని ప్లేట్‌లెట్‌లు వేగంగా పడిపోతుంటాయి. సమయానికి చికిత్స తీసుకోకుండా ఆలస్యం చేస్తే రోగి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది. ఏడిస్ ఈజిప్టై (Aedes aegypti) అనే దోమకాటు ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. మరి ఈ ప్రమాదకర డెంగీ బారినపడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Health tips : వానాకాలం వచ్చిందంటే చాలు జనాలను డెంగీ జ్వరం (Dengue fever) గడగడలాడిస్తుంది. ఎందుకంటే ఈ వైరల్ ఫీవర్ బారినపడితే రోగిలోని ప్లేట్‌లెట్‌లు వేగంగా పడిపోతుంటాయి. సమయానికి చికిత్స తీసుకోకుండా ఆలస్యం చేస్తే రోగి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది. ఏడిస్ ఈజిప్టై (Aedes aegypti) అనే దోమకాటు ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. దీన్నే టైగర్ దోమ అని కూడా అంటారు. డెంగీ చికిత్సకు లైసెన్స్ పొందిన వ్యాక్సిన్‌గానీ, నిర్దిష్ట యాంటీవైరల్ థెరపీగానీ అందుబాటులో లేదు. కానీ సప్లిమెంట్ మందులు ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాధిని ముందుగా గుర్తిస్తే తేలిగ్గా కోలుకోవచ్చు. మరి ఈ ప్రమాదకర డెంగీ బారినపడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
జాగ్రత్తలు..
- డెంగీ ఫీవర్‌కు కారణమయ్యే ఈ ఆడ ఏడిస్ దోమలు రాత్రిపూట తిరగవు. తెల్లవారుజాము నుంచి మళ్లీ చీకటిపడే పగటి వేళల్లోనే ఈ గోధుమ రంగు దోమలు కుడుతుంటాయి. కాబట్టి రాత్రిపూట దోమ తెరలు వాడినంత మాత్రాన డెంగీని అడ్డుకోలేం. పగటివేళల్లో దోమకాటుకు గురికాకుండా జాగ్రత్త వహించాలి.
- ఈ దోమలు నీటిని ఎక్కువగా ఇష్టపడతాయి. కాబట్టి నివాసాల చుట్టుపక్కల ప్రాంతాల్లో, పిల్లలు ఆడుకునే ప్రదేశాల్లో నిలువనీరు లేకుండా జాగ్రత్తపడాలి. బడికి వెళ్లే పిల్లలకు.. దోమలకు శరీరం ఎక్స్‌పోజ్ కాకుండా ఉండే దుస్తులు వేయాలి. హాఫ్ స్కర్ట్‌లు, నిక్కర్‌లు వేయవద్దు. సాక్సులతో కూడిన షూ వేయాలి.
- ఇళ్లలోగానీ, కార్యాలయాల్లోగానీ, విద్యాసంస్థల్లోగానీ దోమల నివారణ మందులను పిచికారీ చేయాలి. అదేవిధంగా పిల్లల్లో వ్యాధినిరోధక శక్తిని పెంచడం కోసం సరైన పౌష్టికాహారం ఇవ్వాలి. సాయంత్రం వేళల్లో కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. ఫిల్టర్ చేసిన లేదా కాచి ఒడబోసిన నీళ్లు మాత్రమే తాగాలి.
- పూలు, కూరగాయల కోసం పెంచే మొక్కల కుండీల్లీ నిలువ నీరు లేకుండా చూసుకోవాలి. ఖాళీ వాటర్ బాటిళ్లు, తాగిపడేసిన కొబ్బరి బొండాలు పరిసరాల్లో లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే వాటిలో ఏ మాత్రం నీరు నిలువ ఉన్నా దోమలు గుడ్లుపెడుతాయి. వేల సంఖ్యలో పిల్లలు చేస్తాయి.
ఇవి కూడా చదవండి
Health tips | వెన్ను కింది భాగంలో భరించలేని నొప్పి.. పరిష్కార మార్గం చెప్పిన పరిశోధకులు..!
Health tips | రాత్రంతా ధనియాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీళ్లు తాగండి.. ఫలితం మామూలుగా ఉండదుగా..!
Alcoholic drink | మద్యం అతిగా మాత్రమే కాదు.. మితంగా తాగినా అనర్థమే.. ఎందుకంటే..!
Monkey pox | అసలు మంకీ పాక్స్ అంటే ఏమిటి.. ఈ వ్యాధి సోకితే ఏమవుతుంది..?
Health tips | వర్షాకాలం అలర్జీలా.. ఈ చిట్కాలతో నయం చేసుకోండి..!
Health tips | వర్షాకాలంలో వీటిని తప్పక తీసుకోవాలి.. అస్సలు మిస్ చేయొద్దు..!